రాష్ట్రానికి మీ కూటమి చేసిన మేలేమిటి?  | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి మీ కూటమి చేసిన మేలేమిటి? 

Published Fri, Apr 19 2024 5:47 AM

Perni Nani Fires On Pawan Kalyan and Chandrababu - Sakshi

చంద్రబాబు, పవన్‌ విషం చిమ్ముతూ ఊరూరా తిరుగుతున్నారు 

సీఎం జగన్‌ని మీరు ఎంత మాటైనా అనొచ్చు.. తిరిగి మిమ్మల్ని అంటే ఏడుపులా?  

టీడీపీలో ఉన్నప్పుడు తోట త్రిమూర్తులు మంచోడు, మా పార్టీలో ఉంటే చెడ్డోడా?  

వాస్తవాలు చెప్పే జగన్‌ కావాలా?.. అబద్ధాల బాబు కావాలా?: పేర్ని నాని 

సాక్షి, అమరావతి: 2014 నుంచి ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, బీజేపీ కూటమి రాష్ట్రానికి ఏం మేలు చేసిందో చెప్పే ధైర్యం ఉందా అని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని) సవాల్‌ విసిరారు. జన్మభూమి కమిటీలతో అద్భుతమైన పరిపాలన చేశామని, మళ్లీ అధికారంలోకి వస్తే ఆ కమిటీలు తెస్తామని చెప్పగలరా అని నిలదీశారు. ఆ దమ్ము లేకే సీఎం జగన్‌ ఏర్పాటు చేసిన ఉత్తమమైన వలంటీర్‌ వ్యవస్థను కొనసాగిస్తామంటున్నారని అన్నారు. ఇదీ చంద్రబాబు, పవన్‌ దిగజారుడు రాజకీయమని చెప్పారు.

గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌పై చంద్రబాబు, పవన్‌ విషం చిమ్ముతూ ఊరూరా తిరుగుతున్నారని విమర్శించారు. సీఎం జగన్‌ రాష్ట్రంలోని కోట్లాది మందికి రూ.2.70 లక్షల కోట్లు నేరుగా ఆరి్థక పరిపుష్టి కలగజేస్తే ఈ రాష్ట్రం శ్రీలంక అవుతుందని, ఈ ప్రభుత్వం రద్దయిపోతుందని అన్న ఈ మూడు పార్టీలు ఇప్పుడు సీఎం జగన్‌ పథకాలనే కాపీ కొడుతున్నాయని చెప్పారు. ఇప్పటికే రూ.6 లక్షల కోట్ల హామీలు ఇచ్చారని, ఇంకా ఇస్తారని అన్నారు.

2014లో పవన్, మోదీ ఫోటోలేసి ఇంటింటికి వెళ్లి పంచిన హామీలన్నీ అమలు చేసినట్లు చంద్రబాబు ప్రజలతో చెప్పించగలరా అని ప్రశి్నంచారు. సీఎం జగన్‌ని వారు ఎంత మాటైనా అనొచ్చని, తిరిగి వారిని తాము ఏమైనా అంటే ఏడుపులా అని అన్నారు. ఆడియో ఫంక్షన్‌లో పవన్‌ ఎందుకు తన గురించి నోరు జారారని నిలదీశారు. మీరు చెప్పుతో కొడతానంటే, మాకూ రెండు చెప్పులున్నాయని చెప్పానని అన్నారు. జడ్జితో మాట్లాడి తోట త్రిమూర్తులుకి బెయిల్‌ ఇప్పించారని అబద్ధం చెప్పారన్నారు.

శిరోముండనం కేసు 1996లో జరిగిందని, అప్పుడు తోట త్రిమూర్తులు ఉన్నది టీడీపీలోనే అని చెప్పారు. ఈ కేసులో ముద్దాయిగా ఉన్నప్పుడు టీడీపీ నుంచి పోటీ చేశారన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు త్రిమూర్తులు మంచోడు, మా పార్టీలో ఉంటే చెడ్డోడా అని ప్రశి్నంచారు. నిజాయితీగా వాస్తవాలు చెప్పే సీఎం జగన్‌ కావాలా? పంజా చేతికి చిక్కే వరకూ సాధుజంతువులా నటించే చంద్రబాబు కావాలా ఉద్యోగులు ఆలోచించుకొని అడుగులు వేయాలని సూచించారు. 

వాసవీ అమ్మవారి వద్ద ప్రమాణం చేద్దామా? 
మచిలీపట్నంలో బాబు మాట్లాడిన ప్రతి మాటా అబద్ధమేని పేర్ని నాని చెప్పారు. తమ నియోజకవర్గ నేత కొల్లు రవీంద్ర ఏ అబద్ధం చెవిలో చెబితే బాబు అది మాట్లాడారన్నారు. రాం నితీష్‌ అనే వ్యక్తి మాల్‌ కట్టుకుంటే ఎన్వోసీ ఇవ్వడానికి తాను లంచం అడిగినట్లు అతనితో చెప్పించాలని చాలెంజ్‌ చేశారు. తమ్మని వారి సత్రం ఆక్రమించినట్లు ఆర్యవైశ్య సమాజంలో క్రియాశీలకంగా ఉన్న ఏ ఒక్క సభ్యుడితోనైనా చెప్పించాలని అన్నారు. కొల్లు రవీంద్ర, ఇతర నేతలు వస్తే వాసవీ అమ్మవారి వద్ద ప్రమాణం చేద్దామన్నారు.

తన రాజకీయ జీవితంలో పాపపు సొమ్ము రూపాయి కూడా ముట్టుకోలేదన్నారు. కొల్లు రవీంద్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ట్రాన్స్‌ఫర్లలో డబ్బులు దండుకుంటున్నాడని అంధ్రజ్యోతి పత్రికలోనే రెండు సార్లు రాశారని చెప్పారు. కొల్లు లంచగొండితనాన్ని  బాబే భరించలేకపోయారని, మంత్రి పదవి పీకేస్తానంటే.. కాళ్లపై పడటంతో ఎలాంటి ఫైల్స్‌ రాని న్యాయ శాఖ, స్పోర్ట్స్‌ మంత్రిగా ఇచ్చారన్నారు. 

కృష్ణమూర్తిపై కిరాతకంగా మాట్లాడతారా? 
2019 ఎన్నికల షెడ్యూల్‌కు ముందు బందర్‌ పోర్టుకు చంద్రబాబు చేసింది మోసపు శంకుస్థాపన అని, ఆ   పేరుతో రూ.8.60 కోట్లు దోచేశారని చెప్పారు. జీవో 217 ద్వారా మత్స్యకారులకు ఏం అన్యాయం జరిగిందో బాబు చెప్పాలన్నారు. తన కుమారుడు, నవ యువకుడు పేర్ని కృష్ణమూర్తి మొదటిసారి పోటీ చేస్తుంటే, అతన్ని ప్రజలు గుర్తిస్తే, 75 ఏళ్ల వయసొచి్చన చంద్రబాబు కిరాతకంగా మాట్లాడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసేవ చేయాలనే బలమైన ఆకాంక్షతో తన కుమారుడు రాజకీయాల్లోకి వచ్చి నాలుగేళ్లవుతోందని, కరోనా సమయంలో ఎంతో సేవ చేసి ప్రజల మన్ననలు పొందాడని తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement