వరంగల్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రాజయ్య ! | Sakshi
Sakshi News home page

వరంగల్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రాజయ్య! ఫాంహౌజ్‌లో కేసీఆర్‌తో భేటీ

Published Fri, Apr 12 2024 3:36 PM

Tatikonda Rajaiah Likely To Contest From Warangal As Brs Candidate - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్‌ నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా స్టేషన్‌ఘన్‌పూర్‌ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. ఈ మేరకు రాజయ్య పేరును కేసీఆర్‌ కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. వరంగల్‌ అభ్యర్థిని నిర్ణయించేందుకు జిల్లా నేతలతో కేసీఆర్‌ ఎర్రవెల్లిలోని ఫాంహౌజ్‌లో శుక్రవారం(ఏప్రిల్‌ 12) భేటీ అయ్యారు. ఈ భేటీకి రాజయ్యకు కూడా పిలుపు అందడంతో వరంగల్‌ నుంచి ఆయన పోటీ చేయడం ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది.    

వరంగల్‌ నుంచి ఇప్పటికే  బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ప్రకటించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియ్యం కావ్య కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో బీఆర్‌ఎస్‌ తాజాగా మళ్లీ అభ్యర్థిని ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన సిట్టింగ్‌ సీటు స్టేషన్‌ఘన్‌పూర్‌ టికెట్‌ను కడియం శ్రీహరికి ఇచ్చారని అలకబూనిన రాజయ్య ఎన్నిలు పూర్తయి ఫలితాలు వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. తాజాగా కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్యతో కలిసి కాంగ్రెస్‌కు వెళ్లడంతో రాజయ్య తిరిగి బీఆర్‌ఎస్‌లోకి వచ్చేందుకు ఓకే అన్నట్లు సమాచారం. 

కాగా, ప్రస్తుతం వరంగల్‌ నియోజకవర్గంలో విచిత్ర పరిస్థితి నెలకొం‍ది. బీఆర్‌ఎస్‌కు ప్రత్యర్థులుగా ఉన్న రెండు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులిద్దరూ బీఆర్‌ఎస్‌ను ఇటీవల వీడి టికెట్‌ తీసుకున్న వారే కావడం గమనార్హం. దీంతో బీఆర్‌ఎస్‌కు తమ పార్టీ నుంచి వెళ్లిన వారిపైనే పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ బీజేపీ నుంచి వర్థన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌, కాంగ్రెస్‌ నుంచి కడియం కావ్య బరిలో ఉన్నారు. 

ఇదీ చదవండి.. బీఆర్‌ఎస్‌ నుంచి డబ్బు తీసుకుంది నిరూపిస్తే దేనికైనా రెడీ.. కడియం

Advertisement
Advertisement