No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Tue, Apr 16 2024 6:45 AM

- - Sakshi

ఓబీసీ ఇన్‌చార్జిగా డా.సూర్యవర్మ

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): మెదక్‌ పార్లమెంట్‌ ఓబీసీ ఇన్‌చార్జిగా జిల్లా ఓబీసీ సెల్‌ చైర్మన్‌ డాక్టర్‌ సూర్యవర్మను నియమిస్తూ తెలంగాణ ప్రదేశ్‌ ఓబీసీ సెల్‌ చైర్మన్‌, తెలంగాణ బీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ నూతి శ్రీకాంత్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారని కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్‌ తెలిపారు.

బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడుగా రమణారెడ్డి

దుబ్బాక: బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడుగా స్థానిక మల్లుగారి రమణారెడ్డి నియామకం అయ్యారు. సోమవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు మోహన్‌రెడ్డి ఉత్తర్వులు అందజేశారు.

కల్యాణోత్సవాలకు సర్వం సిద్ధం

మిరుదొడ్డి(దుబ్బాక): శ్రీరామనవమి సందర్భంగా 17న నిర్వహించే కల్యాణ మహోత్సవాలకు ఏర్పా ట్లు పూర్తి చేసినట్లు సీతారామచంద్రస్వామి ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సోమవారం కల్యాణోత్సవ పత్రాలను ఆవిష్కరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకుడు అప్పన్‌కందాడై పార్థ సారథి, ఆలయ కమిటీ సభ్యులు అంజిరెడ్డి, నారాయణ, భిక్షపతి, మల్లేశం, వెంకట్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

ధ్వజస్తంభ యంత్రవిగ్రహ ప్రతిష్ఠ

దుబ్బాక: పట్టణంలోని మహంకాళి దేవాలయంలో 3రోజులుగా గణపతి సహిత ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు సోమవారం వేదపడింతులు జయరామశర్మ, రామకృష్ణశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్‌ మల్లుగారి నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

50 మందికి నేత్ర పరీక్షలు

మద్దూరు(హుస్నాబాద్‌): దూల్మిట్ట మండలంలోని కొండాపూర్‌లో సిద్దిపేట ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. 50మందికి నేత్ర పరీక్షలుచేసి అవసరమైన 10మందికి ఉచితంగా ఆపరేషన్‌ కోసం రిఫర్‌ చేశారు. వైద్యులు పావని, సీనియర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌ నరేశ్‌, పంచాయతీ కార్యదర్శి అశోక్‌, మాజీ ఉపసర్పంచ్‌ బావు కనుకయ్య తదితరులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన ఆలయం

కొండపాక(గజ్వేల్‌): కుకునూరుపల్లిలోని సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో 16 నుంచి 21 వరకు బ్రహ్మోత్సవాల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. 16న ధ్వజారోహణం, 17న కల్యాణోత్సవం, 17న సామూహిక కుంకుమార్చనలు, 19న గరుఢ రథంపై ఊరేగింపు, 21న పూర్ణాహుతి ఉంటుందని ట్రస్టు నిర్వాహకులు తెలిపారు.

ఆలయ నిర్మాణానికి విరాళం

నంగునూరు(సిద్దిపేట): జేపీ తండాలో నూతనంగా నిర్మిస్తున్న దుర్గా, వీరాంజనేయ స్వామి దేవాలయానికి రంగదాంపల్లికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వంగ రాజేశ్వర్‌రెడ్డి సోమవారం రూ.50వేలు విరాళం అందజేశారు. మాజీ సర్పంచ్‌ బుక్యా భిక్షపతినాయక్‌, లక్ష్మణ్‌నాయక్‌, వీరానాయక్‌, గౌరబోయిన రాజు, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

మెదక్‌ పార్లమెంట్‌ స్థానం కాంగ్రెస్‌దే

ప్రశాంత్‌నగర్‌(సిద్ధిపేట): మెదక్‌ పార్లమెంట్‌ స్థానం కాంగ్రెస్‌ పార్టీదేనని ఆపార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్‌ అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌, బీజేపీలు కాంగ్రెస్‌ పార్టీపై లేనిపోని ఆరోపణలు చేయడం తగదన్నారు. రాష్ట్రంలో 17లోక్‌సభ స్థానాలను కై వసం చేసుకుంటుందన్నారు.

సంక్షిప్త వార్తలు

1/1

Advertisement
Advertisement