Sakshi News home page

CWC 2023 Final Big Screens In AP: ఏపీలో ఫ్యాన్స్‌కు పండగే.. 13 జిల్లాల్లో భారీ స్క్రీన్లు! ఏయే చోట అంటే..

Published Sat, Nov 18 2023 5:09 PM

CWC 2023 Final Ind vs Aus: Big Screens Across AP Says ACA Gopinath Reddy - Sakshi

సాక్షి, విశాఖపట్నం: క్రికెట్‌ ప్రపంచం మొత్తం వరల్డ్‌కప్‌-2023 ఫీవర్‌తో ఊగిపోతోంది. ఈ మెగా ఈవెంట్‌కు వేదికైన భారత్‌లో.. ఊరూరా ప్రపంచకప్‌ సందడి మొదలైంది. సొంతగడ్డపై టీమిండియా ట్రోఫీ గెలిస్తే చూడాలనే ఆకాంక్షతో రోహిత్‌ సేనకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు అభిమానులు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరుగనున్న ఫైనల్లో​ ఆస్ట్రేలియాను మట్టికరిపించాలంటూ విషెస్‌ తెలియజేస్తున్నారు.

ఈ నేపథ్యంలో.. అభిమానులకు మరింత వినోదం అందించేందుకు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) సిద్ధమైంది. భారత్‌– ఆస్ట్రేలియా జట్ల మధ్య  ఫైనల్‌ మ్యాచ్‌ను పెద్ద స్క్రీన్ల (ఫేన్‌ ఎరీనా)పై తిలకించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఏసీఏ కార్యదర్శి ఎస్‌.ఆర్‌. గోపినాథ్‌రెడ్డి వెల్లడించారు.


 
స్టేడియంలో ఉన్న వాతావరణాన్ని కల్పించి ఆనందంగా మ్యాచ్‌ను చూసేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదట ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మ్యాచ్‌ను అభిమానులు ఉచితంగా వీక్షించవచ్చన్నారు. 

అదే విధంగా... అక్కడ ఫుడ్‌ కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు గోపీనాథ్‌రెడ్డి వెల్లడించారు. ఇక ప్రపంచకప్‌ ఫైనల్‌ నేపథ్యంలో.. పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేసేందుకు అడిగిన వెంటనే అనుమతులు ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. 

పెద్ద స్క్రీన్‌ ఏర్పాటు చేసే స్థలం జిల్లాల వారీగా..
1. విశాఖపట్నం: ఆర్కీ బీచ్ , కాళీ మాత టెంపుల్ ఎదురుగా
2. అనంతపురం: పోలీస్ ట్రైనింగ్ కాలేజ్  (పి.టి.సి)
3. ఏలూరు: ఇండోర్ స్టేడియం గ్రౌండ్, కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా
4. గుంటూరు: మాజేటి గురవయ్య హై స్కూల్ గ్రౌండ్
5. కడప: ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్
6. కాకినాడ: రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్
7. కర్నూల్: డి.ఎస్. ఏ. స్టేడియం
8. నెల్లూరు: వి.ఆర్. హైస్కూల్ గ్రౌండ్
9. ఒంగోలు: జెడ్పీ మినీ స్టేడియం
10. శ్రీకాకుళం: ఎం. హెచ్. స్కూల్ గ్రౌండ్, 7 రోడ్ జంక్షన్
11. తిరుపతి: కె.వి.ఎస్. స్పోర్ట్స్ పార్క్, తుమ్మలకుంట గ్రౌండ్
12. విజయనగరం: ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, భాష్యం స్కూల్ వెనుక
13. విజయవాడ: ఎం.జి. రోడ్, ఇందిర గాంధీ మున్సిపల్ స్టేడియం.

Advertisement

What’s your opinion

Advertisement