ఉత్కంఠ పోరులో విజయం.. సెమీ ఫైనల్‌కు చేరిన పాకిస్తాన్‌ | Under-19 World Cup 2024, Pakistan Vs Bangladesh: Pakistan Beat Bangladesh By Five Runs - Sakshi
Sakshi News home page

ఉత్కంఠ పోరులో విజయం.. సెమీ ఫైనల్‌కు చేరిన పాకిస్తాన్‌

Published Sun, Feb 4 2024 8:12 AM

Pakistan Beat Bangladesh to the semifinals in thrilling finish - Sakshi

అండర్‌ 19 వరల్డ్‌కప్‌-2024లో పాకిస్తాన్‌ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. బెనోని వేదికగా బంగ్లాదేశ్‌తో ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో విజయం సాధించిన పాక్‌.. తమ సెమీస్‌ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. 156 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా జట్టు 35.5  ఓవర్లలో 150 పరుగులకే ఆలౌటైంది. పాక్‌ విజయంలో పేసర్‌ ఉబైడ్‌ షా కీలక పాత్ర పోషించాడు.

ఉబైడ్‌ షా 5 వికెట్లు పడగొట్టి పాక్‌ను సెమీస్‌కు చేర్చాడు. ఉబైడ్‌ షాతో పాటు అలీ రజా 3 వికెట్లు, జీషన్ ఒక్క వికెట్‌ సాధించాడు. బంగ్లా బ్యాటర్లలో మహ్మద్ షిహాబ్ జేమ్స్(26) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ కూడా 40.4 ఓవర్లలో 155 పరుగులకే కుప్పకూలింది.

ఆల్‌రౌండర్‌ అరాఫత్ మిన్హాస్(34) రాణించడంతో నామమాత్రపు స్కోరైనా పాక్‌ సాధించగల్గింది. బంగ్లా బౌలర్లలో షేక్ పావెజ్ జిబోన్, రోహనత్ డౌల్లా బోర్సన్ తలా 4 వికెట్లు పడగొట్టారు. ఇక ఈ మెగా టోర్నీ సెకెండ్‌ సెమీఫైనల్లో ఫిబ్రవరి 8న ఆస్ట్రేలియాతో పాక్‌ తలపడనుంది. అదే విధంగా తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా, భారత్‌ తాడోపేడో తెల్చుకోనున్నాయి.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement