ఇరువర్గాల మధ్య ఘర్షణ | Sakshi
Sakshi News home page

ఇరువర్గాల మధ్య ఘర్షణ

Published Wed, May 15 2024 4:20 AM

ఇరువర

కిర్లంపూడి: ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో వైఎస్సార్‌ సీపీ కార్యకర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. మండల పరిధి వేలంకలోని పోలింగ్‌ బూత్‌లో సోమవారం వైఎస్సార్‌ సీపీ కార్యకర్త అడబాల శ్రీనుపై దాడి జరిగింది. ఈ దాడిలో శ్రీను తీవ్రంగా గాయపడడంతో ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం పిఠాపురం మండలం, పవర గ్రామంలో ఉన్న ట్రినిటి ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కాకినాడ ఎంపీ అభ్యర్ధి చలమలశెట్టి సునీల్‌, జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్ధి తోట నరసింహం ఆసుపత్రికి పరామర్శించారు. జరిగిన ఘటనపై అడిగి తెలుసుకున్నారు. వారి వెంట మండల సచివాలయాల కన్వీనర్‌ జోకా శ్రీను, దోమాల గంగాధర్‌ పలువురు ఉన్నారు.

ఇరువర్గాల మధ్య ఘర్షణ
1/1

ఇరువర్గాల మధ్య ఘర్షణ

Advertisement
 
Advertisement
 
Advertisement