No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Fri, May 17 2024 8:55 AM

-

వీసీల నియామక ప్రక్రియ జోరందుకోవడంతో తెలంగాణ యూనివర్సిటీ వైస్‌–చాన్స్‌లర్‌ (వీసీ) గా ఎవరు వస్తారోననే చర్చ సాగుతోంది. తెయూ వీసీ గా పని చేసిన ప్రొఫెసర్‌ డి రవీందర్‌గుప్తా తీవ్రమైన అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు. గత ఏడాది జూన్‌ 17న వర్సిటీ పరిధిలోని ఒక ప్రైవేటు కళాశాల యజమాని వద్ద లంచం తీసుకుంటూ నేరుగా ఏసీబీకి పట్టుబడి జైలుకు వెళ్లారు. పదవిలో ఉన్న వీసీ రవీందర్‌గుప్తా జైలుకు వెళ్లడంతో రాష్ట్రంలో తెయూ పరువు, ప్రతిష్ట మంటగలిసింది. దీంతో అప్పటి నుంచి ఐఏఎస్‌ అధికారులే తెయూ ఇన్‌చార్జి వీసీగా కొనసాగుతున్నారు.

ప్రస్తుతం కొత్త వీసీల నియామక ప్రక్రియ ఊపందుకోవడంతో ఈ సారి కొత్తగా వీసీగా వచ్చే వారైనా తెయూను గాడిలో పెట్టాలని విద్యార్థులు, అధ్యాపకులు, విద్యావంతులు ఆశిస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement