తుప్పు పట్టాయి | Sakshi
Sakshi News home page

తుప్పు పట్టాయి

Published Sat, Apr 20 2024 1:20 AM

- - Sakshi

పచ్చని మొక్కలు, పిల్లలక్రీడా సామగ్రితో ఒకప్పుడు కళకళలాడిన పార్క్‌.. ఇప్పుడు ఎండిన మొక్కలతో అధ్వానంగా తయారైంది. పిల్లలు ఆడుకునే పరికరాలు విరిగిపోయాయి. కొన్ని తుప్పు పట్టాయి. బోర్‌ నుంచి నీళ్లు రావడం లేదు. మొక్కలు ఎండిపోతున్నాయి.

– సంధ్యారాణి, గంగానగర్‌, గోదావరిఖని

అభివృద్ధి చేయాలి

అధికారులు పార్క్‌పై పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారు. మోడల్‌ పార్క్‌గా అభివృద్ధి చేయాలి. ఆకతాయిలు పార్క్‌లోనే మద్యం తాగుతున్నారు. పిల్లల ఆటవస్తువులు విరిగిపోయాయి. బాత్‌రూంకు నీటి సరఫరా లేదు. నీళ్లులేక మొక్కలు ఎండిపోతున్నాయి.

– ఇందారపు సతీశ్‌, దుర్గానగర్‌, గోదావరిఖని

చర్యలు తీసుకుంటాం

నగరంలోని పార్క్‌ల పరిస్థితి, వాటిలోని సమస్యలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తాం. వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపడతాం. మొక్క లు ఎండిపోకుండా నీళ్లు అందిస్తాం. ఉద్యాన వనాలకు పూర్వవైభవం తీసుకువచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తాం. – శ్రీకాంత్‌, కమిషనర్‌,

నగరపాలక సంస్థ, రామగుండం

1/2

2/2

Advertisement
Advertisement