జాగ్రత్తలతో ప్రమాదాల నివారణ | Sakshi
Sakshi News home page

జాగ్రత్తలతో ప్రమాదాల నివారణ

Published Thu, Apr 18 2024 10:35 AM

వైద్యులు, సిబ్బందికి అవగాహన కల్పిస్తున్న అగ్నిమాపక అధికారులు  - Sakshi

తాండూరు టౌన్‌: అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు భయభ్రాంతులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తాండూరు ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్‌ నాగార్జున అన్నారు. అగ్నిప్రమాద నివారణ వారోత్సవాల్లో భాగంగా బుధవారం తాండూరు పట్టణంలోని ఎస్వీఆర్‌ ఆస్పత్రిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్నిప్రమాదం, షార్ట్‌సర్క్యూట్‌, సిలిండర్‌ పేలడం వంటివి జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రోగులను ఎలా కాపాడాలో ప్రదర్శన ఇచ్చారు. ఎఫ్‌ఎస్‌ఓ మాట్లాడుతూ.. వేసవిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలున్నాయని, తాగిపడేసిన బీడీ, సిగరెట్‌, వంటగదిలో ఆఫ్‌ చేయని గ్యాస్‌ సిలిండర్‌ తదితర వాటి వలన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్‌ కార్యాలయానికి సమాచారం అందజేయాలన్నారు. ఫైర్‌ సిబ్బంది, ఆస్పత్రి అధికారులు పాల్గొన్నారు.

ఫైర్‌ డ్రిల్‌ నిర్వహించాలి

అనంతగిరి: అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని బుధవారం వికారాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదాలు జరిగినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అగ్నిమాపక అధికారి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. ఆస్పత్రిలో అగ్నిమాపక పరికరాలను సరిచూసుకోవడానికి, అగ్ని ప్రమాదాలు జరిగినపుడు రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ప్రతి అంతస్తులో ఫైర్‌ వార్డెన్‌ను నియమించాలన్నారు. ఆస్పత్రిలో 3నెలలకు ఒకసారి ఫైర్‌ డ్రిల్‌ నిర్వహించాలన్నారు. ప్రమాదం సమయంలో భయాందోళన చెందవద్దన్నారు. జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చన్నారు. ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది, ఫైర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఫైర్‌సేఫ్టీ అధికారులునాగార్జున, వెంకటరమణారెడ్డి

ఆస్పత్రుల్లో మాక్‌డ్రిల్‌

Advertisement
Advertisement