Sakshi News home page

Income Tax: బకాయిలుంటే ట్యాక్స్‌ రీఫండ్‌లో కటింగ్‌!

Published Sat, Sep 23 2023 9:18 PM

Income Tax Dept urges taxpayers previous arrears adjusted in refund - Sakshi

ఆదాయపు పన్ను బకాయిలను వసూలు చేయడానికి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ (Income Tax Department) సరికొత్త ప్రణాళిక రచించింది. బకాయిలున్న పన్ను చెల్లింపుదారులు తమకు రావాల్సిన ట్యాక్స్‌ రీఫండ్‌ (Tax refund) తో బకాయిలను సర్దుబాటు చేసుకునే అవకాశాన్ని ఆదాయపు పన్ను శాఖ కల్పించింది. 

ఆదాయపు పన్ను రిటర్న్‌ల (ITR) ప్రాసెసింగ్‌ను వేగవంతంగా పూర్తి చేసేందుకు, రీఫండ్‌ల జారీని త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఐటీ శాఖ తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.

(New Rules: అక్టోబర్‌ 1 నుంచి అమలయ్యే కొత్త మార్పులు, నిబంధనలు ఇవే..) 

పన్ను బకాయిలు కూడా అధిక మొత్తంలో ఉన్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పెండింగ్‌లో ఉన్న బకాయిలను సర్దుబాటు చేసి ట్యాక్స్‌ రీఫండ్‌లను సకాలంలో జారీ చేయడానికి సహకరించాలని కోరింది.

బకాయిల సర్దుబాటుపై తమ సమ్మతిని తెలియజేయడానికి ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్ 245(1) ట్యాక్స్‌ పేయర్లకు అవకాశం కల్పిస్తుంది. దీని ప్రకారం.. బకాయిల సర్దుబాటుపై తమ అంగీకరిస్తున్నారో.. లేదో అని తెలియజేయాల్సి ఉంటుంది.

(RBI Rules: వారికి 6 నెలలే సమయం.. ఆర్బీఐ కీలక నిబంధనలు)

2023-24 అసెస్‌మెంట్ ఇయర్ కోసం 7.09 కోట్ల రిటర్న్‌లు దాఖలుకాగా 6.96 కోట్ల ఐటీఆర్‌లను ఆదాయపు పన్ను శాఖ వెరిఫై చేసింది. ఇక ఇప్పటివరకు వీటిలో 2.75 కోట్ల రిటర్న్స్‌కు ట్యాక్స్‌ రీఫండ్‌ను చెల్లించగా 6.46 కోట్ల రిటర్న్‌లను ప్రాసెస్ చేసినట్లు ఐటీ శాఖ పేర్కొంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement