పేటీఎంకు కేంద్రం భారీ షాక్‌ | Sakshi
Sakshi News home page

పేటీఎంకు కేంద్రం భారీ షాక్‌

Published Fri, Mar 1 2024 7:11 PM

Ministry Of Finance Imposed Penalty Of 5.49 Crore On Paytm Payments Bank Ltd - Sakshi

ప్రముఖ ఫిన్‌టెక్‌ దిగ్గజం పేటీఎంకు చెందిన పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ (ppbl)కు భారీ షాక్‌ తగిలింది. కేంద్ర ఆర్ధిక శాఖ ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌-ఇండియా(FIU-IND) పీపీబీఎల్‌కు భారీ జరిమానా విధించింది. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) నిబంధనల ఉల్లంఘింపు కారణమే ఈ జరిమానా అని తెలిపింది.

మనీలాండరింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్-ఇండియా రూ.5.49 కోట్ల జరిమానా విధించింది .

కేంద్ర ఆర్ధిక శాఖ మార్చి 1న విడుదల చేసిన ఒక ప్రకటనలో.. తన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ విభాగానికి ఆన్‌లైన్‌లో లావాదేవీలు, లావాదేవీలను సులభతరం చేయడంతో సహా కొన్ని సంస్థలు చట్ట విరుద్దంగా వ్యాపార కార్యకాలాపాలు చేస్తున్నాయంటూ పలు ప్రభుత్వ ఏజెన్సీల నుండి సమాచారం వచ్చింది. దీంతో పేటీఎం పేమెంట్‌ బ్యాంక్‌ లావాదేవీలపై  దృష్టిసారించాం. తాము చేసిన విచారణలో పీపీబీఎల్‌లోని లొసుగులు వెలుగులోకి వచ్చాయి.    

ముఖ్యంగా ‘చట్టవిరుద్ధ కార్యకలాపాల నుండి వచ్చిన డబ్బు అంటే అసాంఘీక కార్యకాలపాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప‌లు సంస్థ‌లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ ద్వారా పలు అకౌంట‍్లకు మళ్ళించిటన్లు తాము గుర్తించామని’, కాబట్టే చర్యలు తీసుకున్నట్లు  ప్రకటనలో పేర్కొంది.

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ అందించిన పలు ఆధారాల్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఎఫ్‌ఐయూ-ఐఎన్‌డీ ఈ చర్యలకు ఉపక్రమించినట్లు కేంద్ర ఆర్ధిక వెల్లడించింది.

Advertisement
Advertisement