జియో ఫైనాన్షియల్‌ లిస్టింగ్‌ త్వరలో.. | Sakshi
Sakshi News home page

జియో ఫైనాన్షియల్‌ లిస్టింగ్‌ త్వరలో..

Published Mon, Aug 7 2023 12:30 AM

Mukesh Ambani aims to make his recently demerged Jio Financial Services - Sakshi

న్యూఢిల్లీ: రిటైల్, టెలికం రంగాల్లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తాజాగా ఆర్థిక రంగంలోనూ అదే తీరును కొనసాగించడంపై దృష్టి పెడుతోంది. త్వరలోనే జియో ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ను స్టాక్‌ ఎక్సే్చంజీల్లో లిస్ట్‌ చేయనున్నట్లు సంస్థ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ వెల్లడించారు. తద్వారా సంస్థ పూర్తి విలువను, సామర్థ్యాలను వెలికి తీసే అవకాశం ఉంటుందని సంస్థ వార్షిక నివేదికలో పేర్కొన్నారు. పర్యావరణ అనుకూల ఇంధనాలపైనా భారీగా ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

సాంప్రదాయ శిలాజ ఇంధనాల నుంచి పునరుత్పాదక ఇంధన వనరులకు మళ్లడమనేది చరిత్రలోనే కీలక మైలురాయిగా నిలవగలదని అంబానీ తెలిపారు. అటు మరో అయిదేళ్ల పాటు అంబానీని సీఎండీగా కొనసాగించాలన్న  ప్రత్యేక తీర్మానానికి షేర్‌హోల్డర్ల ఆమోదాన్ని కంపెనీ కోరింది. ప్రస్తుతం 66 ఏళ్లున్న అంబానీ.. సంస్థ నిబంధనల ప్రకారం 70 ఏళ్లకు రిటైర్‌ కావాలి. అంతకు మించిన కాలవ్యవధికి కొనసాగించదల్చుకుంటే దానికి ప్రత్యేక తీర్మానం చేయాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement