కళ్ళముందే సరికొత్త ప్రపంచం.. మొదలైన 'మొబైల్ వరల్డ్ కాంగ్రెస్' ఈవెంట్ | Sakshi
Sakshi News home page

MWC 2024: కళ్ళముందే సరికొత్త ప్రపంచం.. మొదలైన 'మొబైల్ వరల్డ్ కాంగ్రెస్' ఈవెంట్

Published Mon, Feb 26 2024 5:58 PM

MWC 2024 Event in Barcelona Spain - Sakshi

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న '2024 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్' (MWC 2024) ఈవెంట్ ఈ రోజు ప్రారంభమైంది. స్పెయిన్‌లోని బార్సిలోనాలో ప్రారంభమైన MWC 2024 ఈవెంట్ ఈ రోజు నుంచి గురువారం (ఫిబ్రవరి 26 నుంచి 29) వరకు జరుగుతుంది. ఇందులో అనేక స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు స్మార్ట్‌ఫోన్‌లను, యాక్సెసరీలను, ఏఐ టెక్నాలజీతో కూడిన ఆవిష్కరణలను ప్రవేశపెట్టనున్నాయి.

ఈ ఈవెంట్‌లో శాంసంగ్, షావోమీ, రియల్‌మీ, వివో, మోటొరోలా, లెనోవో, ఇన్‌ఫీనిక్స్, టెక్నో వంటి అనేక టెక్ కంపెనీలు తమ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను ప్రపంచానికి పరిచయం చేయనున్నాయి. ల్యాప్‌టాప్‌ల విషయానికి వస్తే.. ఇందులో హెచ్‌పీ, లెనోవో, డెల్, అసుస్ మొదలైన కంపెనీలు ఉన్నట్లు తెలుస్తోంది.

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024లో ఎక్కువగా ఏఐ బేస్డ్ మోడల్స్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పెరుగుతున్న ఏఐ టెక్నాలజీని దృష్టిలో ఉంచుకుని టెక్ కంపెనీలు చాలా వరకు తమ ఉత్పత్తులలో కూడా ఏఐ ఫీచర్స్ అందించాలని సంకల్పించాయి.

ఇదీ చదవండి: కోడింగ్ అవసరమే లేదు!.. ఎన్విడియా సీఈఓ కీలక వ్యాఖ్యలు

గత ఏడాది ఈ ఈవెంట్ సందర్శించడానికి ఏకంగా లక్షల మంది జనం వెళ్లినట్లు సమాచారం. ఈ సంవత్సరం ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ ఈవెంట్‌లో లాంచ్ కావడానికి దిగ్గజ కంపెనీల ఉత్పత్తులు సిద్ధంగా ఉన్నాయి. 29వ తేదీ వరకు ఈ ఉత్పత్తులను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

Advertisement
Advertisement