బాధ్యత నాది | Sakshi
Sakshi News home page

బాధ్యత నాది

Published Wed, May 8 2024 6:35 AM

బాధ్య

IIలోu

సాక్షి, వరంగల్‌, హనుమకొండ చౌరస్తా: ‘ఈ వరంగల్‌ ప్రాంతం హైదరాబాద్‌తో సమానంగా అభివృద్ధి చెందాల్సింది. రాణిరుద్రమ సాక్షిగా మాట ఇస్తు న్నా. ఔటర్‌ రింగ్‌ రోడ్డు, ఎయిర్‌ పోర్టు, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ, టెక్స్‌టైల్‌ పార్కుతో పాటు గుడి, మసీదు, చర్చిలకు నిధులు ఇచ్చి అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా’ అని టీపీసీసీ అధ్యక్షు డు, సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ వరంగల్‌ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా వరంగల్‌ పశ్చిమ, వరంగల్‌ తూర్పు నియోజకవర్గాల్లో మంగళవారం జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ‘ఈ ప్రాంత కాకతీయ యూ నివర్సిటీ విద్యార్థులు, ఉద్యమకారులు తొలి, మలి దశ ఉద్యమాలు నడిపి రాష్ట్ర సాధనలో ప్రధాన భూమిక పోషించారు. చారిత్రక నేపథ్యమున్న వరంగల్‌ పట్టణానికి ఉజ్వల భవిష్యత్‌ కల్పించాల్సి ఉండగా.. కేసీఆర్‌ పాలనలో ఈ ప్రాంతమంతా మసకబారిపోయింది. పదేళ్లలో రూ.21 లక్షల కోట్లు చేతికిస్తే సిగ్గు లేని దద్దమ్మలు వరంగల్‌కు అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ, ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మించలేదు. ఎయిర్‌ పోర్టు కట్టలేదు. టెక్స్‌టైల్‌ పార్కు పూర్తి చేయలేదు. లెదర్‌ పార్కుకు అణాపైసా ఇవ్వలేదు. పైగా.. బీఆర్‌ఎస్‌ వాళ్లు సిగ్గు లేకుండా మా పాలన 100 రోజులు కూడా కాలేదు.. అప్పుడే దిగిపో దిగి పో అంటున్నారు. మీలాగా అడుక్కొనో, మంది పిల్లల్ని చంపో ఈ కుర్చీలోకి రాలేదన్నారు. అండగా కొండా మురళీధర్‌రావు వంటి వాళ్లు ఉండబట్టి.. వరంగల్‌ ఈస్ట్‌లో గెలవబట్టి ఈరోజు ఈ కుర్చీలో ఉన్నాం’అని చెప్పారు. మంత్రి కొండా సురేఖ అడిగినట్టుగా గుడి, చర్చి, మసీదు నిర్మాణాలకు రూ.3 కోట్లు జూన్‌ 30లోపు స్పెషల్‌ డెవలప్‌ మెంట్‌ ఫండ్‌ తరపున చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ‘కడి యం శ్రీహరి నిజాయితీగా, నిబద్ధతతో ఉమ్మడి రాష్ట్రంలో.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో చిత్తశుద్ధి తో ప్రజలకు సేవ చేశారు కాబట్టి ఆయన వారసత్వంగా కడియం కావ్యకు కాంగ్రెస్‌ టికెట్‌ ఇచ్చింది. శ్రీహరి దగ్గర వందల కోట్లు ఉన్నవని చూసి ఇవ్వ లే. ఆయన అనుభవాన్ని తెలంగాణ రాష్ట్రానికి విని యోగించాలనుకున్నాం’ అని రేవంత్‌ రెడ్డి అన్నారు. వరంగల్‌ తూర్పులో కొండా సురేఖకు మించి డాక్టర్‌ కడియం కావ్యకు మెజార్టీ తీసుకురావాల్సిన బాధ్య త కొండా మురళికి ఇస్తున్నామని తెలిపారు. ‘ఇక్కడి బీజేపీ అభ్యర్థి అరూరి రమేశ్‌ భూకబ్జాకోరు. దందా లు చేసినోడు. అవినీతి పరులను అంతమొందిస్తామని మోదీ అంటున్నాడు. అరూరి అంత నీతిమంతుడా’ అని ప్రశ్నించారు. చీకటి ఒప్పందంలో భాగంగా బీఆర్‌ఎస్‌ వాళ్లు వారి నాయకుడు అరూరి ని బీజేపీకి పంపించిర్రు. వరంగల్‌ ప్రజలు వివేకవంతులు. జరగబోయే ఎన్నికల్లో డాక్టర్‌ కావ్యను లక్ష మెజారిటీతో గెలిపిస్తారు’ అని సీఎం అన్నారు. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్‌ నాగరాజు, మాజీ ఎంపీ దయాకర్‌, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ, మేయర్‌ సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

శ్రేణుల్లో జోష్‌

వర్షం వచ్చినా సీఎం రేవంత్‌ రెడ్డి కార్నర్‌ మీటింగ్‌ లకు ప్రజలు భారీగా హాజరవ్వడంతో శ్రేణుల్లో జోష్‌ కనిపించింది. హనుమకొండ చౌరస్తాలో గిరిజన గోండు జానపద నత్యాలు, బోనాలతో మహిళలు ఘన స్వాగతం పలికారు.

ఇంకా ఎవరెవరు ఏమన్నారంటే..

ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ కడియం కావ్య మాట్లాడుతూ.. వరంగల్‌ను ఆరు ముక్కలుగా చేసిన బీఆర్‌ఎస్‌ పార్టీని ఇక్కడి ప్రజలు బొంద పెట్టా రు. రానున్న రోజుల్లో వరంగల్‌ను మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడు తూ.. చారిత్రక నగరం వరంగల్‌ను ప్రత్యేక దృష్టితో చూడాలి. రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తానన్నందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపా రు. మంత్రి ధనసరి సీతక్క మాట్లాడుతూ.. గాంధీ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి, గాడ్సే సిద్ధాంతంతో ముందుకెళుతు న్న బీజేపీల మధ్య జరుగుతున్న పోరాటంలో పేదల పక్షపాతి కాంగ్రెస్‌కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

బాధ్యత నాది
1/1

బాధ్యత నాది

Advertisement
 
Advertisement
 
Advertisement