కొంతకాలంగా ఈక్విటీమార్కెట్‌లు భారీగా పుంజుకున్నాయి. దాంతో బంగారం ధరలు పడిపోయాయి. ఇటీవల మళ్లీ మార్కెట్‌లో అనిశ్చితులు నెలకొంటున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మార్కెట్లు పడిపోతున్నాయి. దాంతో తిరిగి బంగారం ధరలు పెరుగుతున్నాయి. పెట్టుబడిదారులు సేఫ్డ్ అసెట్స్‌లో భాగంగా పసిడిని ఎంచుకుంటారు. కాబట్టి బుధవారం గోల్డ్‌రేట్లు స్వల్పంగా పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో పసిడిధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.67,100 (22 క్యారెట్స్), రూ.73,200 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. మంగళవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల ధరలు వరుసగా రూ.250, రూ.270 పెరిగింది.
చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.350, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.380 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.67,750 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.73,910 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్)కు చేరింది.
దేశ రాజధాని నగరం దిల్లీలో కూడా నేడు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు రూ.67,250.. 24 క్యారెట్ల ధర రూ.73,350కు చేరింది.
ఇదీ చదవండి: వ్యాధుల నియంత్రణకు ఏఐ సహాయం
వెండి ధరలు
వెండి ధర మార్కెట్‌లో భారీగా పెరుగుతోంది. బుధవారం కేజీ వెండి ధర ఏకంగా రూ.1200 పెరిగి రూ.1,02,200కు చేరింది. దాంతో లక్షమార్కును దాటినట్లయంది. వెండి తయారీలో ప్రధానపాత్ర పోషిస్తున్న, స్టాక్‌మార్కెట్‌లో లిస్ట్ అయిన ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ జింక్ స్టాక్ ధర నెల రోజులుగా భారీగా పెరిగింది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).
Comments
Please login to add a commentAdd a comment