Gold Rate Today: బంగారం భగభగలు.. ఆకాశాన్నంటుతున్న ధరలు | Sakshi
Sakshi News home page

Gold Rate Today: బంగారం భగభగలు.. ఆకాశాన్నంటుతున్న ధరలు

Published Thu, Apr 4 2024 1:36 PM

Today Gold Rates On Major Cities In India - Sakshi

దేశంలో పసిడి ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. బంగారం ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతూ ఆల్‌టైంహైని చేరుకుంటున్నాయి. తాజాగా పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ.70 వేల మార్క్‌ను దాటింది.

మార్కెట్‌ వర్గాల ప్రకారం.. గురువారం ఉదయం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారుగా రూ.70,620కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,750గా ఉంది. ఇక వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.82,000 చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్‌ అధికంగా ఉండటంతో దేశీయంగా ధరలు బలపడుతున్నట్లు మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఈరోజు ఈ కింది విధంగా ఉన్నాయి.

  • దిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,744 కాగా, 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.70,682గా ఉంది.
  • చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,450 కాగా, 24 క్యారెట్ల పసిడి రూ.71,400గా ఉంది.
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.64,600 కాగా, 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.70,470 పలుకుతోంది.
  • బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లో బంగారం ధరలు ఒకేతీరుగా ఉన్నాయి. ఈ రెండు మెట్రో నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,600 కాగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.70,470కి చేరింది.
  • ముంబయిలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 64,600 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.70,470 గా ఉంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 64,600 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.70,470 గా ఉంది.
  • విశాఖపట్నంలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 64,600 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.70,470 గా ఉంది.

(ఇదీ చదవండి..‘ఐదు రోజులు తిండి లేదు.. ఆ బాధ మీకు తెలియదు’)

Advertisement
Advertisement