చూడటానికి పసందైనా.. ధరకి వామ్మో అనాల్సిందే..! | Sakshi
Sakshi News home page

చూడటానికి పసందైనా.. ధరకి వామ్మో అనాల్సిందే..!

Published Sun, Mar 24 2024 1:47 PM

An American Sweet Which Costs Millions - Sakshi

చూడటానికి ఎంతో పసందుగా ఉన్న ఈ మిఠాయి ఖరీదు తెలుసుకుంటే మాత్రం కళ్లు చెదురుతాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మిఠాయి. ఈ మిఠాయి పేరు ‘స్ట్రాబెర్రీస్‌ ఆర్నాడ్‌’.

అమెరికాలోని న్యూ ఆర్లీన్‌లో ఉన్న ‘ఆర్నాడ్‌’ రెస్టారెంట్‌ ప్రత్యేకంగా రూపొందించిన మిఠాయి ఇది. సన్నగా తరిగిన స్ట్రాబెర్రీ ముక్కలు, నారింజ ముక్కలు, లవంగం, దాల్చినచెక్క, వెనీలా ఐస్‌క్రీమ్, బాగా గిలకొట్టిన పాలమీగడతో తయారు చేసిన ఈ మిఠాయిపైన ఆరురకాల ఖరీదైన షాంపేన్‌ చిలకరించి, దీనిపైన తాజా పుదీనా ఆకులను, మేలిమి బంగారు రేకులను అలంకరిస్తారు.

దీని ఖరీదు 9.85 మిలియన్‌ డాలర్లు (రూ.81.50 కోట్లు). దీనికి ఇంత ఖరీదు ఎందుకని ఆశ్చర్యపోతున్నారా? దీనిని అలా ఊరకే కప్పులో పెట్టి వడ్డించి వదిలేయరు. దీంతో పాటే, కప్పు అడుగున ఉన్న సాసర్‌లో చక్కని పెట్టెలో 10.06 కేరట్ల వజ్రాలను పొదిగిన బంగారు ఉంగరాన్ని ఉంచి మరీ వడ్డిస్తారు. ఐస్‌క్రీమ్‌ తినేసి, వజ్రాల ఉంగరాన్ని తీసేసుకోవచ్చు.

ఇవి చదవండి: ఈ పండుగ కొందరకి హోలీ అయితే.. మరి కొందరికి ‘హోలా మొహల్లా’..

Advertisement
Advertisement