Sakshi News home page

మానవ మెదళ్లు పెద్దవి అవుతున్నాయ్‌! ఇక ఆ వ్యాధి..

Published Thu, Mar 28 2024 5:14 PM

Study Said Human Brains Getting Bigger - Sakshi

మానవ మెదళ్లు పరిమాణంలో వస్తున్న మార్పులను గుర్తించారు శాస్త్రవేత్తలు. ఒక తరానికి మరొక తరానికి మధ్య చాలా వ్యత్యాసం ఉ‍న్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడించారు. దీన్ని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా డేవిస్‌ హెల్త్‌ బృందం నిర్థారించింది. ఈ మేరకు యూఎస్‌లోని దాదాపు 55 నుంచి 65 ఏళ్ల మధ్య వయసు ఉన్న మూడు వేల మంది వృద్ధులపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయ్యింది.

1930లలో జన్మించిన వారి కంటే 1970లలో (జనరేషన్ X) మొత్తం మెదడు పరిమాణం 6.6 శాతం ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. అలాగే మునపటితరం సభ్యులకంటే ప్రస్తుత జనరేషన్‌ మెదడులో దాదాపు 8% ఎక్కువ వైట్‌ మ్యాటర్‌, 15% ఎక్కువ గ్రే మ్యాటర్‌ ఉందని పరిశోధనలో తేలింది. అంటే.. మునపటితరంతో పోలిస్తే ఇక్కడ మెదడు వాల్యూమ్‌ 5.7% పెరిగిందని తెలిపారు. దీని కారణంగా నేర్చుకోవడం, జ్ఞాపకశక్తిలో మెరుగుదల ఉంటుందన్నారు.

అలాగే వయసు రీత్యా వచ్చే అల్జీమర్స్‌ వంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని చెప్పారు. ఎవరైనా జన్మించినప్పుడు ఉన్న మెదడు పరిమాణం పైనే దీర్ఘకాలిక మెదడు ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఇలా మెదడు పరిమాణం పెరిగితే వృద్ధాప్య వ్యాధులకు వ్యతిరేకంగా శక్తి పెరుగుతుందన్నారు. తత్ఫలితంగా అల్జీమర్స్‌ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెప్పారు పరిశోధకులు. ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా మిలియన్లమంది ప్రజలను ప్రభావితం చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా అమెరికాలో దాదాపు 7 మిలియన్ల మందికి పైగా ప్రజలు ఈ వ్యాధితోనే బాధపడుతున్నారని నివేదికలు పేర్కొన్నాయి. 

(చదవండి: గుడ్లు ఎక్కువగా తింటున్నారా ? పరిశోధనలో షాకింగ్‌ విషయాలు!)


 

Advertisement

What’s your opinion

Advertisement