స్టెల్లర్‌ బ్లేడ్‌..! గ్రహాంతరవాసులతో వార్‌..!! | Sakshi
Sakshi News home page

స్టెల్లర్‌ బ్లేడ్‌..! గ్రహాంతరవాసులతో వార్‌..!!

Published Fri, Apr 19 2024 1:07 PM

This Week Action And Adventure Game War With Aliens - Sakshi

Gaming

యాక్షన్‌ అడ్వెంచర్‌ గేమ్‌ ‘స్టెల్లర్‌ బ్లేడ్‌’ ఈ నెల 26న విడుదల కానుంది. కథ విషయానికి వస్తే భూమి మీద ఉన్న మనుషులకు, గ్రహాంతవాసులకు మధ్య యుద్ధం జరుగుతుంది. గ్రహాంతరవాసులతో యుద్ధంలో ఓడిపోయిన తరువాత మానవాళి తరిమివేయబడుతుంది.

కోల్పోయిన తమ స్వస్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఈవ్‌తో పాటు ఆమె దళం ‘నయతిబా’ అనే గ్రహాంతరవాసులతో పోరాటానికి సిద్ధం అవుతుంది. థర్డ్‌–పర్సన్‌ పర్‌స్పెక్టివ్‌ నుంచి ఆడే గేమ్‌ ఇది. శత్రువు వ్యూహాల ఆధారంగా ఎదురు దాడి చేయాల్సి ఉంటుంది. ఈ గేమ్‌కు సంబంధించిన డెమోను గత నెల విడుదల చేశారు.

జానర్స్‌: యాక్షన్, అడ్వెంచర్‌..
ఇంజిన్‌: అన్‌రియల్‌ ఇంజిన్‌4
మోడ్స్‌: సింగిల్‌–ప్లేయర్‌
ప్లాట్‌ఫామ్‌: ప్లేస్టేషన్‌ 5

ఇవి చదవండి: ఈ షాకింగ్‌ నిజాల గురించి మీకు తెలుసా?

Advertisement
Advertisement