ప్రధాని మోదీపై పుతిన్‌ ప్రశంసలు | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీపై పుతిన్‌ ప్రశంసలు.. అందుకే భారత్‌పై విశ్వాసం

Published Fri, Jan 26 2024 7:38 PM

Putin Huge Praise For PM Modi Over Russia Can Rely On India - Sakshi

మాస్కో: ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పలు ప్రతికూల పరిస్థితుల్లో కూడా భారత్‌ అమలు పరుస్తున్న విదేశి విధానాలు అసాధారణమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఇటువంటి సమయంలో అన్ని రంగాల్లో ప్రపంచం వ్యాప్తంగా దూసుకుపోవటానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వంటి ధృడమైన నాయకత్వం ఉండటమే కారణమని మోదీపై పుతిన్‌ ప్రశంసలు కురిపించారు.

భారత్‌ను శక్తివంతమైన దేశంగా ముందుకు నడిపించటంలో మోదీ గుర్తింపు పొందారని పుతిన్‌ అభిప్రాయపడ్డారు. గురువారం కలింగ్‌రాడ్‌ ప్రాంతంలో నిర్వహించిన ‘రష్యన్‌ స్టుడెంట్‌ డే’ కార్యక్రమంలో పుతిన్‌ పాల్గొన్నారు.

‘ప్రపంచంలో ఆర్థికంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారత్‌. సమర్థవంతమైన నాయకత్వం లక్షణాలు ఉన్న వ్యక్తి భారత్‌కు ప్రధానిగా ఉన్నారు. ప్రధాని నాయకత్వ పటిమ వల్లనే ఇండియా ఈ రోజు మనం చూస్తున్న వృద్ధిలో​కి వచ్చింది’ పుతిన్‌ పేర్కొన్నారు. ‘ప్రపంచ వేదికలపై భారత్‌.. రష్యాపై ఎప్పుడూ వ్యతిరేకమైన వైఖరితో నిర్ణయాలు తీసుకోలేదు. రష్యాపై ఇప్పటివరకు ద్వంద వైఖరిని భారత్‌ ప్రదర్శించలేదు. అందుకే భారత్‌, ఆ దేశ నాయకత్వంపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉంది’ అని పుతిన్‌ అభిప్రాయపడ్డారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ వంటి కార్యక్రమం రష్యాతోపాటు ప్రపంచ దేశాల్లో కూడా చర్చకు వస్తోందన్నారు. భారత్‌కు అంత్యంత ఎక్కువ విదేశి పెట్టుబడులు రష్యా నుంచి లభిస్తున్నాయని తెలిపారు. తమ దేశంలోని పలు కంపెనీలు భారత్‌లో ఇప్పటికే సుమారు సుమారు 23 బిలియన్‌ అమెరికా డాలర్ల మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టినట్లు వెల్లడించారు.

చదవండి:  ఖరీదైన బ్యాగ్‌ గిఫ్ట్‌.. దక్షిణ కొరియా రాజకీయాల్లో దుమారం

Advertisement
Advertisement