Ari Movie: Foreigners Enjoying Mangli Song - Sakshi
Sakshi News home page

Ari: మంగ్లీ పాటకు విదేశీ యువతులు స్టెప్పులు.. వీడియో

Published Tue, Mar 7 2023 2:34 PM

Ari Movie: Foreigners Enjoying Mangli Song - Sakshi

‘పేపర్ బాయ్ ’చిత్రంతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న జయశంకర్‌ దర్శకత్వంలో రూపొందిన కొత్త సినిమా ‘అరి’.. మై నేమ్ ఈజ్ నో బడీ అనేది ఉపశీర్షిక. ఆర్వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మించిన సినిమా ఇది. అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, సుమన్, ఆమని, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.

ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ‘చిన్నారి కిట్టయ్య’పాటకు ప్రేక్షకులను నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రముఖ గాయని మంగ్లీ ఆలపించిన ఈ పాటకు విదేశీ యువతులు సైతం ఫిదా అయ్యారు. ఈ పాటకు తమదైన శైలీలో స్టెప్పులేస్తూ ఎంజాయ్‌ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. శ్రీకృష్ణుడి గొప్పదనం గురించి తెలియజేస్తూ సాగే ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్‌ అందించగా అనూప్ రూబెన్స్ స్వరపరిచాడు. 

Advertisement
 
Advertisement
 
Advertisement