హిందీ వార్‌లో హాలీవుడ్‌ యాక్షన్‌  | Sakshi
Sakshi News home page

హిందీ వార్‌లో హాలీవుడ్‌ యాక్షన్‌ 

Published Sat, Apr 20 2024 1:51 AM

Captain America action director Spiro Razatos roped in Hrithik Roshan and Jr NTR War 2 - Sakshi

బాలీవుడ్‌ ‘వార్‌ 2’లో హాలీవుడ్‌ తరహా యాక్షన్‌ కనిపించనుంది. హృతిక్‌ రోషన్, ఎన్టీఆర్‌ లీడ్‌ రోల్స్‌లో అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ ‘వార్‌ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తారట. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ ముంబైలోని ఓ స్టూడియోలో జరిగింది. హృతిక్‌ రోషన్, ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరించారట మేకర్స్‌.

ఈ పోరాట దృశ్యాలను హాలీవుడ్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ స్పిరో రజాటోస్‌ డిజైన్‌ చేశారని బాలీవుడ్‌ సమాచారం. ఇక ‘కెప్టెన్‌ అమెరికా: ది సివిల్‌ వార్‌’, ‘కెప్టెన్‌ అమెరికా: ది ఫస్ట్‌ సోల్జర్‌’ ‘ఫాస్ట్‌ ఎక్స్‌’ వంటి హాలీవుడ్‌ చిత్రాలకు యాక్షన్‌ డిజైన్‌ చేశారు స్పిరో. కాగా స్పై జానర్‌లో ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్న ‘వార్‌ 2’ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 14న రిలీజ్‌ కానుంది. 

Advertisement
Advertisement