రొమాంటిక్‌ దేవర! | Sakshi
Sakshi News home page

రొమాంటిక్‌ దేవర!

Published Mon, Feb 26 2024 2:13 AM

Jr NTR Devara Part 1 release on October 10th 2024 - Sakshi

డ్యాన్స్ మోడ్‌లోకి వెళ్లనున్నారు హీరో ఎన్టీఆర్‌. ‘జనతా గ్యారేజ్‌’ (2016) వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా చిత్రం ‘దేవర’. ఈ మూవీలో జాన్వీకపూర్‌ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్  ఓ కీలక పాత్ర చేస్తున్నారు. కల్యాణ్‌రామ్, కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్‌ నిర్మిస్తున్న ‘దేవర’ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది.

తొలిభాగం ‘దేవర పార్ట్‌ 1’ ఈ ఏడాది అక్టోబరు 10న రిలీజ్‌ కానుంది. తొలి భాగానికి సంబంధించిన మేజర్‌ యాక్షన్  సీక్వెన్స్ ల చిత్రీకరణ ఓ కొలిక్కి వచ్చిందని సమాచారం. దీంతో టాకీ, పాటల చిత్రీకరణపై ఫోకస్‌ పెట్టారట దర్శకుడు కొరటాల శివ. సాంగ్స్‌ చిత్రీకరణలో భాగంగా గోవా, కొచ్చి లొకేషన్స్ ను పరిశీలించారట చిత్రయూనిట్‌. మార్చి తొలి వారంలో ‘దేవర’ సాంగ్స్‌ చిత్రీకరణ మొదలు కానుందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ఎన్టీఆర్, జాన్వీల కాంబినేషన్ లో ఓ రొమాంటిక్‌ సాంగ్‌ ఉంటుందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఈ సినిమాకు అనిరుధ్‌ రవిచంద్రన్  సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement