యూపీలో క్లీన్‌ స్వీప్‌ చేస్తాం: అమిత్‌ షా | Sakshi
Sakshi News home page

యూపీలో క్లీన్‌ స్వీప్‌ చేస్తాం: అమిత్‌ షా

Published Thu, Mar 21 2024 6:30 AM

Lok sabha elections 2024: NDA will win over 400 seats in Lok Sabha elections - Sakshi

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌ బీజేపీ 2014 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆయన న్యూస్‌ 18 సదస్సులో మాట్లాడారు. వారసత్వ రాజకీయాలు చేసే పార్టీలకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. యూపీలో 80 సీట్లకు గాను 2014లో బీజేపీ 71 గెలుచుకుంది. ఎన్డీఏ భాగస్వామి అప్నాదళ్‌ రెండు స్థానాలు దక్కించుకుంది.

ఒడిశాలో పొత్తులపై అధికార బిజూ జనతా దళ్‌ (బీజేడీ)తో చర్చలు జరుగుతున్నాయని, తుది నిర్ణయాన్ని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా తీసుకుంటారని షా తెలిపారు. ఒంటరిగా పోరాడాలనుకుంటే ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకే ప్రయతి్నస్తామని స్పష్టం చేశారు. పంజాబ్‌లో అకాలీ దళ్‌తో పొత్తు విషయంపై రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. బెంగాల్‌లో తమ పార్టీ 25 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని, పంజాబ్‌తోపాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ అధిక సీట్లు సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. జమ్మూ కశీ్మర్‌ అసెంబ్లీ ఎన్నికలకు సుప్రీంకోర్టు సెప్టెంబర్‌ వరకు గడువిచి్చందని, అంతకుముందే వాటిని నిర్వహిస్తామని అమిత్‌ షా  చెప్పారు.

Advertisement
Advertisement