London : యూకేలో మేమంతా సిద్ధం | Sakshi
Sakshi News home page

London : యూకేలో మేమంతా సిద్ధం

Published Thu, Apr 11 2024 3:37 PM

YSRCP cadre says Memantha Sidham in UK - Sakshi

సీఎం జగన్‌కు మద్ధతుగా యూకేలో ర్యాలీ

లండన్‌, ఇతర ప్రాంతాల్లో మేమంతా సిద్ధం జోష్‌

మళ్లీ సీఎంగా జగన్‌ ఎన్నికవుతారంటూ ప్రచారం

లండన్‌ :

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిర్వహిస్తోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (UK) నుంచి వైఎస్సార్‌సిపి నేతలు సంఘీభావం ప్రకటించారు. వైఎస్సార్‌సిపికి మద్ధతుగా యూకేలోని వేర్వేరు ప్రాంతాల్లో ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.

మేమంతా సిద్ధం #memanthasiddham

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం యాత్రకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని కొనియాడారు YSRCP UK కన్వీనర్లు Dr ప్రదీప్ చింతా , ఓబుల్‌ రెడ్డి పాతకోట. UKలోని లెస్టర్లో మేమంతా సిద్ధం సంఘీభావ సభ నిర్వహించారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి 59 నెలలుగా కష్టపడుతున్నారని, ఈ ఒక్క నెలా విదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులంతా జగనన్నకోసం కష్టపడి మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని Dr ప్రదీప్ చింతా కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో YSRCP UK కమిటీ సభ్యులు జనార్దన్ చింతపంటి, నారాయణరెడ్డి, కార్తీక్ భూమిరెడ్డి, చాళుక్య , ఆదిత్య, క్రాంతి పాలెం, కూమార్ రెడ్డి, పురుషోత్తంరెడ్డి యనుముల, సతీష్ నర్రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సతీష్ ఉగ్గుముడి, పునీత్ తదితరులు పాల్గొన్నారు. UK నలుమూలలనుండి పలువురు వైఎస్సార్‌సిపి కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

యుద్ధానికి సిద్ధం

దేశ రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టాలకు వేదికగా ‘మేమంతా’ సిద్ధం బస్సు యాత్ర జరుగుతోందన్నారు ప్రదీప్‌ చింతా. ఐదేళ్లు తమకు కాపు కాచిన సీఎం జగన్‌కు ఊరూరా.. అడుగడుగునా జనం నీరాజనం పడుతున్నారని, జననేతను చూసేందుకు.. కరచాలనం.. మాట కలిపేందుకు.. ఫొటోల కోసం ఆరాటం చూస్తుంటే.. ప్రజల గుండెల్లో సీఎం జగన్‌కు ఎంత అభిమానం, అప్యాయత ఉందో తెలిసిపోతోందన్నారు. మండుటెండల్లోనూ గంటల తరబడి రోడ్డుపై జననేత కోసం ఓపిగ్గా నిరీక్షిస్తున్నారని, చంటి బిడ్డలను చంకనేసుకుని బస్సు వెంట తల్లులు పరుగులు తీస్తున్నారన్నారు. టీవీల్లో మేమంతా సిద్ధం యాత్ర చూస్తుంటే ప్రతీ వైఎస్సార్‌సిపి కార్యకర్త గుండె ఉప్పొంగిపోతోందని, ఇన్నాళ్లు పడ్డ కష్టం ప్రజల కళ్లలో కనిపిస్తోందన్నారు.  మేమంతా సిద్ధం యాత్ర ఒరవడికి కూటమి కొట్టుకుపోవడం ఖాయమన్నారు. జూన్‌ 4న విడుదలయ్యే ఫలితాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నామని చెప్పారు ప్రదీప్‌.

Advertisement
Advertisement