బీఆర్‌ఎస్‌ వరంగల్‌ బరిలో సుధీర్‌కుమార్‌  | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ వరంగల్‌ బరిలో సుధీర్‌కుమార్‌ 

Published Sat, Apr 13 2024 4:34 AM

KCR Nominates Sudhir Kumar as BRS Candidate for Warangal MP Seat - Sakshi

ఉద్యమ నేపథ్యం, పార్టీ పట్ల విధేయత మేరకు అవకాశం 

పార్టీ ముఖ్యనేతలతో చర్చ అనంతరం ఖరారు చేసిన కేసీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌:  వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గా డాక్టర్‌ మారేపల్లి సు«దీర్‌కుమార్‌ పేరును పార్టీ అధినేత కేసీఆర్‌ ఖరారు చేశారు. ప్రస్తుతం హనుమకొండ జెడ్పీ చైర్మన్‌గా ఉన్న సుధీర్‌ కుమార్‌.. 2001 నుంచి తెలంగాణ ఉద్యమకారుడిగా, పార్టీ విధేయుడిగా ఉన్నారు. దీనికితోడు మాదిగ సామాజికవర్గానికి చెందిన నేతకు ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలన్న నిర్ణయం మేరకు సు«దీర్‌కుమార్‌ అభ్యర్థి త్వాన్ని ఖరారు చేశారు. ఈ మేరకు కేసీఆర్‌ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్టు వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలు శుక్రవారం ప్రకటించారు. అభ్యర్థి ని ఖరారు చేసిన నేపథ్యంలో పారీ్టలో సమన్వయం, ప్రచారంపై కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. 

కీలక నేతలతో మంతనాలు: వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదుగురు మాజీ ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలతోపాటు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కేసీఆర్‌ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం సుదీర్ఘంగా భేటీ అయ్యారు. బీఆర్‌ఎస్‌ తరఫున బరిలోకి దింపాలని నిర్ణయించిన కడియం కావ్య.. పార్టీని వీడటంతో ప్రత్యామ్నాయ అభ్యర్థి కోసం కొనసాగిన వేటపై ఈ సమావేశంలో చర్చించారు. ఇటీవల జిల్లాకు చెందిన నేతలు సిఫార్సు చేసిన నలుగురి పేర్లపై చర్చించి.. చివరికి సు«దీర్‌కుమార్‌ పేరును ఖరారు చేశారు.

తొలుత స్టేషన్‌ఘన్‌పూర్‌ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పేరును కూడా పరిశీలించినా.. ఆయనకు స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఇన్‌చార్జి బాధ్యతలు ఇచ్చేందుకే కేసీఆర్‌ సుముఖత వ్యక్తం చేశారు. అయితే ఎంపీ టికెట్‌ ఇవ్వకపోవడంతో రాజయ్య తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరేదీ, లేనిదీ స్పష్టత రావాల్సి ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 

సానుకూల సంకేతాలు పంపేందుకే! 
అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి, తర్వాత పార్టీని వీడినవారికి కాకుండా.. ఇకపై పార్టీని అంటిపెట్టుకుని ఉండే వారికే అవకాశాలు వస్తాయన్న సంకేతాలు ఇచ్చేందుకే సు«దీర్‌కుమార్‌ను అభ్యర్థి గా ఎంపిక చేసినట్టు బీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి. వరంగల్‌ ఎంపీ టికెట్‌ ఆశించిన వంగపల్లి శ్రీనివాస్, సుందర్‌ రాజు, డాక్టర్‌ నిరంజన్, స్వప్న తదితరులకు భవిష్యత్తులో గుర్తింపు దక్కుతుందని హామీ ఇచి్చనట్టు వివరిస్తున్నాయి.

కేసీఆర్‌తో శుక్రవారం జరిగిన భేటీలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, వినయ్‌ భాస్కర్, నరేందర్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, బండ ప్రకాశ్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బసవరాజు సారయ్య తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement