Sakshi News home page

ఆరు గ్యారంటీలేమో కానీ..ఆరు నెలలకొకసారి సీఎం మారడం పక్కా : కేటీఆర్‌

Published Tue, Nov 14 2023 12:05 PM

Ktr Comments on Congress Party in Builders Federation Meeting - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ ః కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఏమో గానీ ఆరు నెలల కొకసారి సీఎం మారటం మాత్రం పక్కా అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. తాజ్ డెక్కన్ హోటల్‌లో మంగళవారం  జరిగిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్(టీబీఎఫ్‌) సమావేశంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కొంతమంది గిట్టని వాళ్ళు మేము ఓడిపోవాలని కోరుకునే వాళ్ళు ఈ తొమ్మిదేళ్లలో కేసిఆర్ ఏం చేయలేదు అని మాట్లాడుతుంటారు. కానీ కేసిఆర్ ప్రజల మనిషి

స్థిరమైన ప్రభుత్వం, దృఢమైన నాయకత్వం ఉన్నప్పుడే అభివృద్ది సాధ్యపడుతుంది. బోర్‌ కొట్టిందని ఎవరైనా ప్రభుత్వం మారాలని కోరుకుంటారా. అభివృద్ధి చేసేవాళ్లు మరికొంత కాలం ఉంటే తప్పేంటి. తొమ్మిదేళ్లలో మేం అసాధారణ విజయాలు సాధించాం. ఆరున్నర సంవత్సరాల మా పని తీరు, గత 65ఏళ్ల ప్రభుత్వాల పనితీరు మీరు గమనించారు. మూసీ నది సుందరీకరణ చేస్తాం అని కాంగ్రెస్ చెప్తోంది. మూసీ నది నాశనం చేసింది కాంగ్రెస్ కాదా? 

కాంగ్రెస్‌ పార్టీకి 11 సార్లు అవకాశం ఇస్తే ఏం పీకారు? మళ్లీ ఒక్క ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి వీళ్లకు?  కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలిచిన తర్వాత అక్కడి బిల్డర్స్ నుంచి కమిషన్ 40 నుంచి 400 రూపాయలకు పెరిగింది. హైదరాబాద్‌లో అభివృద్ది ఇప్పటి దాకా చేసింది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందుంది. వచ్చే ప్రభుత్వంలో మరింత వేగంగా హైదరాబాద్ అభివృద్ధి చేసి చూపిస్తాం. 332 కిలో మీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మిస్తాం. ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య కొత్త హైదారాబాద్ నిర్మిస్తాం. తెలంగాణ జిల్లాలు, హైదరాబాద్‌లో భూముల విలువ గతంలో కంటే 20 శాతం పెరిగింది. గతంలో వ్యవసాయ రంగం కుంటు పడింది. అందుకే ఆనాడు భూముల విలువ లేదు’ అని కేటీఆర్‌ తెలిపారు. 

ఇదీ చదవండి.. కేసీఆర్‌కు కోటి అప్పు ఇచ్చిన వివేక్‌

Advertisement

What’s your opinion

Advertisement