శ్రీకాకుళం జిల్లాలో కూటమికి ఎదురుదెబ్బ | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం జిల్లాలో కూటమికి ఎదురుదెబ్బ.. సీఎం జగన్‌ సమక్షంలో YSRCPలోకి కీలక నేతలు

Published Thu, Apr 25 2024 5:09 PM

Memantha Siddham: Key Leaders Join YSRCP In CM Jagan Presence - Sakshi

శ్రీకాకుళం, సాక్షి: జనం అంతా జగన్‌ వెంటే.. మేమంతా సిద్ధం యాత్రతో ఈ విషయం మరోసారి స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే రాజకీయంగానూ అధికార పార్టీ మరింత బలపడుతోంది. కూటమికి షాకిస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన కీలక నేతలు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు.

తాజాగా బస్సు యాత్రలో భాగంగా బుధవారం ఉదయం ఎచ్చర్ల నియోజకవర్గం అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్‌ సమక్షంలో ప్రతిపక్షాలకు సంబంధించిన కొందరు నేతలు తమ అనుచరగణంతో సహా వైఎస్సార్‌సీపీలో చేరారు. 

వీళ్లలో పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మాజీ జడ్పీటీసీ లోలుగు లక్ష్మణరావు, అలాగే పార్వతీపురం నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్ నేత,  మహిళా  కమిషన్ మాజీ సభ్యురాలు కొయ్యాన శ్రీవాణిలు ప్రముఖంగా ఉన్నారు. 

పలాస నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి, ఆమె కుమార్తె శిరీషలు వైఎస్సార్‌సీపీలో చేరారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం భారతీయ జనతాపార్టీకి చెందిన మాజీ మంత్రి పెద్దింటి జగన్మోహనరావు, ఆయన కుమారుడు పెద్దింటి రామస్వామినాయుడు YSRCP కండువా కప్పుకున్నారు.ఎచ్చర్ల నియోజకవర్గం రణస్ధలం ఎంపీటీసీ మజ్జి గౌరి, టీడీపీ ఉపాధ్యక్షుడు మజ్జి రమేష్, మాజీ ఎంపీపీ గొర్లి విజయకుమార్, సీనియర్ నేత రామారావులు వైఎస్సార్‌సీపీలో చేరారు.

సీఎం జగన్‌ వాళ్లకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ నాయకత్వంలో ముందుకు వెళ్లేందుకు తాము సిద్ధం అని ప్రకటించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement