Sakshi News home page

పట్నాలో ముగిసిన ప్రతిపక్షాల సమావేశం.. సిమ్లాలో మరోసారి భేటీకి నిర్ణయం..

Published Fri, Jun 23 2023 10:56 AM

Opposition party Leaders Meeting In Patna Live Updates - Sakshi

Updates.

♦ పట్నా సమావేశంలో ఎలాంటి ఏకాభిప్రాయం రాలేదని తెలుస్తోంది. ఈ మేరకు ప్రతిపక్ష పార్టీలు సిమాల్లో జులైలో మరోమారు సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. తన నేతృత్వంలోనే ఆ మీటింగ్ జరగనున్నట్లు స్పష్టం చేశారు.  

♦ దేశ పునాదులపై బీజేపీ దాడి చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా పోరాడితేనే దేశాన్ని రక్షించుకోవచ్చని అన్నారు. 

♦ ప్రతిపక్షాలన్నీ ఐక్యమయ్యాయని బిహార్ సీఎం నితీష్ కుమార్ తెలిపారు. 2024 ఎన్నికల్లో కలిసి పోరాడతామని పేర్కొన్నారు. 

 ♦పట్నా సమావేశంతో ప్రజా ఉద్యమం మొదలవుతుందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు.  కేంద్రంపై పోరుకు ఐక్యంగా పోరాడతామని చెప్పారు. నేటి సమావేశం చరిత్రకు పునాది వేస్తుందని చెప్పారు. 

♦ బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే దేశంలో ఎన్నికలే ఉండవని మమతా బెనర్జీ ఆరోపించారు. మొదట ఐక్యమయ్యాం. పట్నాతో కలిసి పోరాడతామనే నిర్ణయానికి వచ్చాం. మిగిలినది సిమ్లాలో నిర్ణయం తీసుకుంటాం అని తెలిపారు. 

♦ పట్నా మీటింగ్ ఫలవంతంగా ముగిసినట్లు మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారందరికీ తాము ప్రతిపక్షమేనని పేర్కొన్నారు.  

♦ పట్నాలో విపక్ష పార్టీల నేతల భేటీ ప్రారంభమైంది.


♦ పాట్నా చేరుకున్న జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌

♦ విపక్షాల భేటీకి హాజరైన ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా. 

♦  సీఎం నితీశ్‌ కుమార్‌ ఇంటికి చేరుకున్న సీఎం మమతా బెనర్జీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ.

♦  పాట్నా చేరుకున్న అఖిలేశ్‌ యాదవ్‌, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్‌ థాక్రే. 

♦ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ బీహార్‌లో కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుస్తుంది. దేశంలోని పేదల కోసం కాంగ్రెస్‌ మాత్రమే పనిచేస్తుంది. బీజేపీ కొద్ది మందికి మాత్రమే లబ్ధి చేకూరుస్తుంది.  బీజేపీని ఓడించాలంటే ఐక్యత ఒక్కటే మార్గం. బీజేపీ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తోందని, విద్వేషాన్ని, హింసను వ్యాప్తి చేస్తోందని అన్నారు.

♦ పాట్నా చేరుకున్న సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి

♦ పాట్నాలో జరిగే ప్రతిపక్ష పార్టీల సమావేశంలో మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితులతో సహా దేశాన్ని పీడిస్తున్న వివిధ ముఖ్యమైన అంశాలను చర్చిస్తాం- శరద్ పవార్ 

పాట్నా చేరుకున్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ.

 పాట్నాకు బయలుదేరిన యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌

♦ ఇది దేశంలోని ప్రతిపక్షాల సమావేశం కాదు, దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ప్రాణ భద్రత కోసమే ఈ సమావేశం. బీజేపీని ఓడించగల ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే, దేశంలో కాంగ్రెస్ తప్ప ఎవరూ బీజేపీని ఓడించలేరు- పప్పు యాదవ్.

పాట్నా:వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. 20 ప్రతిపక్ష పార్టీలతో పట్నాలో శుక్రవారం సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధాని అభ్యర్థి ఎవరు వంటి అంశాల జోలికి పోకుండా ప్రజాసమస్యలపై పోరుబాట పట్టేలా వ్యూహరచన చేయనున్నట్టుగా తెలుస్తోంది.

♦ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, తమిళనాడు, జార్ఖండ్‌ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, కేజ్రివాల్, స్టాలిన్, హేమంత్‌ సోరెన్‌లతో పాటు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్, మహారాష్ట మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ వంటి  అగ్ర నాయకులు హాజరుకానున్నారు. బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్‌ సమావేశానికి ఆతిథ్యం ఇస్తారు.

Advertisement

What’s your opinion

Advertisement