Sakshi News home page

Andre Russell: 'రింకూ లాంటి ఫినిషర్‌ ఉండగా.. టెన్షన్‌ ఎందుకు దండగ'

Published Tue, May 9 2023 5:23 PM

Russell Says Not-Worried If I-Have Rinku Singh Other-End Win Vs PBKS - Sakshi

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో సోమవారం కేకేఆర్‌, పంజాబ్‌ కింగ్స్‌ మ్యాచ్‌ మరో థ్రిల్లర్‌ను తలపించింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ ఆఖరి బంతికి విజయాన్ని అందుకొని ప్లేఆఫ్‌ చాన్స్‌ను మరింత పటిష్టం చేసుకుంది. అయితే కేకేఆర్‌ గెలుపులో ముఖ్య పాత్ర ఆండ్రీ రసెల్‌. కానీ ఆఖరి ఓవర్‌ ఐదో బంతికి రసెల్‌ రనౌట్‌ అవ్వడం కేకేఆర్‌కు బిగ్‌షాక్‌. కానీ చివరి బంతిని రింకూ సింగ్‌ బౌండరీ బాది జట్టును గెలిపించాడు.

అయితే రసెల్‌ తాను రనౌట్‌ అవ్వడంపై బాధపడలేదంట.  కేకేఆర్‌విజయంపై కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు మ్యాచ్‌ అనంతరం పేర్కొన్నాడు. అందుకు కారణం క్రీజులో ఉన్నది రింకూ సింగ్‌ అని పేర్కొన్నాడు.  ''రింకూ సింగ్‌ స్థానంలో ఏ బ్యాటర్‌ ఉన్నా నేను చాన్స్‌ ఇచ్చేవాడిని కాదు.. కానీ రింకూపై నాకున్న నమ్మకం.. నేను రనౌట్‌ అయినప్పటికి పెద్దగా బాధపడలేదు. ఎందుకంటే రింకూ మ్యాచ్‌ను గెలిపిస్తాడని అప్పటికే ఊహించా. విన్నింగ్‌ షాట్‌ కొట్టే చాన్స్‌ అతనికే రావాలని అనుకున్నా.

ఈ సీజన్‌లో రింకూ సింగ్‌ లాంటి ఫినిషర్‌ ఉండగా కేకేఆర్‌ భయపడనసరం లేదు. ఆఖరి ఓవర్‌కు ముందు రింకూ నన్ను ఒక ప్రశ్న అడిగాడు. ''ఒకవేళ బంతి నీకు పడితే పరుగు తీసేందుకు సిద్ధంగా ఉంటావా'' అని అడిగాడు. దానికి ''నేను కచ్చితంగా'' అని సమాధానం ఇచ్చాను.

వాస్తవానికి నేను మ్యాచ్‌ను ఫినిష్‌ చేద్దామనుకున్నా. కానీ రింకూ లాంటి ఫినిషర్‌ ఉన్నప్పుడు అతనికే చాన్స్‌ ఇవ్వాలి. రనౌట్‌ అయిన ఒక్క క్షణం బాధపడ్డా.. నమ్మకం ఉన్నా ఆఖరి బంతికి రింకూ సింగ్‌ ఏం చేస్తాడోనని టెన్షన్‌కు లోనయ్యా. కానీ నా నమ్మకాన్ని రింకూ నిలబెట్టాడు'' అని నవ్వుతూ పేర్కొన్నాడు.

చదవండి: అతడు అద్బుతంగా రాణిస్తున్నాడు.. టీమిండియా రీ ఎంట్రీ పక్కా!

Advertisement

What’s your opinion

Advertisement