Google Flutter Dart Python Teams Terminated From Real Estate And Finance Dept, Details Inside | Sakshi
Sakshi News home page

గూగుల్‌లో మళ్లీ లే ఆఫ్స్‌.. ఎందుకో తెలుసా..

Published Wed, May 1 2024 1:34 PM

Google Flutter Dart Python Teams terminated from real estate and finance Dept

టెక్ దిగ్గజం గూగుల్ కంపెనీ ఫ్లట్టర్, డార్ట్, పైథాన్ టీమ్‌ల నుంచి ఉద్యోగులను తొలగించినట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది. త్వరలో సంస్థ యాన్యువల్‌ డెవలపర్ కాన్ఫరెన్స్‌ జరుగనున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఉద్యోగాలు కోల్పోయినవారు తమ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ల్లో ఈ అంశాన్ని వైరల్‌ చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఎంతమందికి లేఆఫ్స్‌ ప్రకటించారో మాత్రం స్పష్టం కాలేదు.

ఈ సందర్భంగా గూగుల్‌ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘ఉద్యోగాలు కోల్పోయినవారు కంపెనీలోని ఇతర విభాగాల్లో పనిచేసేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. కంపెనీ రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ విభాగాల్లో ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో తొలగింపు ప్రక్రియ అమలుచేసింది. కంపెనీ ఫైనాన్స్‌ విభాగంలో పనిచేసిన ఉద్యోగులను ట్రెజరీ, వ్యాపార సేవలు, ఆదాయ నగదు కార్యకలాపాల్లో పనిచేసేందుకు అనుమతిస్తున్నారు’ అని చెప్పారు.

గూగుల్ ఫైనాన్స్ చీఫ్ రూత్ పోరాట్ లేఆఫ్స్‌కు సంబంధించి ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌లో స్పందిస్తూ.. కంపెనీ నిర్మాణంలో భాగంగా బెంగళూరు, మెక్సికో సిటీ, డబ్లిన్ వంటి ప్రదేశాల్లో గూగుల్ ‘గ్రోత్ హబ్‌లను’ నిర్మిస్తుందని చెప్పారు. రాబోయే అవకాశాల కోసం సిద్ధంగా ఉండాలన్నారు.

ఇదీ చదవండి: మీపేరుపై ఎన్ని సిమ్‌కార్డులున్నాయో తెలుసుకోండిలా..

జనవరిలోనూ వందల మంది ఉద్యోగులను ఇంజినీరింగ్‌, హార్డ్‌వేర్‌, అసిస్టెంట్‌ బృందాల్లో గూగుల్‌ తొలగించింది. కృత్రిమ మేధ(ఏఐ) సామర్థ్యాలను పెంచుకోవడంపై కంపెనీ దృష్టి సారిస్తుండడంతో ఇలా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతుందని తెలిసింది.

Advertisement
Advertisement