నాటుసారా విక్రేతలపై కేసు | Sakshi
Sakshi News home page

నాటుసారా విక్రేతలపై కేసు

Published Fri, May 17 2024 7:00 AM

నాటుసారా విక్రేతలపై కేసు

జన్నారం: నాటుసారా విక్రయిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎకై ్సజ్‌ సీఐ నర్సింహులు తెలిపారు. గురువారం మండలంలోని కామన్‌పల్లి, కిష్టాపూర్‌, కవ్వాల్‌, బంగారుతండా గ్రామాల్లో నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించి నట్లు తెలిపారు. కామన్‌పల్లి గ్రామానికి చెందిన అజ్మీరా అమృతబాయి వద్ద 5 లీ టర్లు, భుక్య లక్ష్మణ్‌ వద్ద 5 లీటర్లు, క వ్వాల్‌ గ్రామానికి చెందిన పబ్బతి బుచ్చ వ్వ వద్ద 5 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నాటుసారా త యారీ, విక్రయిస్తూ మరోసారి పట్టుబడిన వారిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఎస్సై గంగారెడ్డి, సిబ్బంది సమ్మయ్య, శ్రీనివాసరెడ్డి, సాగర్‌, వెంకటేశ్‌, సుజాత పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement