కార్మికుల సమస్యలు పరిష్కరించాలి | Sakshi
Sakshi News home page

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Published Fri, May 17 2024 7:05 AM

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

శ్రీరాంపూర్‌: సింగరేణి కార్మికుల సమస్యలను యాజమాన్యం సత్వరమే పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన ఆర్కే 7 గనిలో కార్మికులను కలిసి సమస్యలు తెలుసుకున్నారు. గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించినా సమస్యలకు పరిష్కారం లభించలేదని తెలిపారు. కార్మికుల సమస్యలపై గుర్తింపు సంఘం ఏఐటీయూసీ పూర్తిగా విఫలం అవుతోందని, సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. రెండేళ్ల కాల పరిమితిని కాదని నాలుగేళ్ల గుర్తింపు కావాలని ఆరాటపడుతున్నారని పేర్కొన్నారు. కార్మికులకు సొంతింటి కల నెరవేర్చాలని, అలవెన్స్‌లపై ఆదాయపన్నును యాజమాన్యమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ బ్రాంచ్‌ అధ్యక్షుడు గుల్ల బాలాజీ, నాయకులు శ్రీధర్‌, సమ్మయ్య, ప్రవీణ్‌ నరేష్‌, అనిల్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement