మళ్లీ రాజకీయాల్లోకి తమిళిసై | Sakshi
Sakshi News home page

మళ్లీ రాజకీయాల్లోకి తమిళిసై

Published Thu, Mar 21 2024 6:26 AM

Lok sabha elections 2024: Former Telangana Governor Tamilisai Soundararajan rejoins BJP - Sakshi

సాక్షి, చెన్నై: తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ బుధవారం మళ్లీ బీజేపీలో చేరారు. చెన్నైలో బుధవారం జరిగిన కార్యక్రమంలో బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, అన్నామలై, ఎల్‌.మురుగన్‌ సమక్షంలో పారీ్టలో చేరారు. ఆమెకు తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సభ్యత్వ కార్డును అందజేశారు.

గవర్నర్‌గా చేసి మళ్లీ రాజకీయాల్లోకి రావడమేంటని విపక్ష పారీ్టలు, అధికార డీఎంకే చేస్తున్న విమర్శలపై అన్నామలై స్పందించారు.  ‘‘ రాజ్యాంగబద్ధ విశిష్ట పదవుల్లో కొనసాగి కూడా తర్వాత సాధారణ కార్యకర్తలా పనిచేసే సదవకాశం ఒక్క బీజేపీలోనే ఉంటుంది. ఇతర రాజకీయ          పారీ్టల్లో పనిచేసి తర్వాత గవర్నర్‌ అయిన వారు మళ్లీ సాధారణ జీవితం కోరుకోరు. వాళ్లకు అత్యున్నత పదవుల్లో కొనసాగడమే ఇష్టం. కానీ బీజేపీ నేతలు అందుకు పూర్తి భిన్నం’ అని ఆయన అన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement