ఎన్నికలు మాకొద్దు..! | Sakshi
Sakshi News home page

ఎన్నికలు మాకొద్దు..!

Published Thu, May 16 2024 1:10 PM

ఎన్ని

అవిభక్త కొరాపుట్‌ జిల్లాలో పలు

గ్రామస్తుల నిర్ణయం

జయపురం: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచాయి. అయినా నేటికి అవిభక్త కొరాపుట్‌ జిల్లాలోని అనేక గ్రామాలు కనీస మౌలిక సౌకర్యాలకు నోచుకోలేదు. ఇప్పటివరకూ పట్టించుకోని ప్రజలు ఇప్పుడు కఠిన నిర్ణయానికి వచ్చారు. తాము వేసిన ఓట్లతో అందలమెక్కే పాలకులు తమ హక్కులను కాలరాస్తున్నారని, కనీస సౌకర్యాలు కల్పించటంలేదని వారు గ్రహించారు. అందుకే ఈ నెల 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికలను బహిష్కరించి.

ఏఏ గ్రామస్తులు బహిష్కరించారంటే..

తమ గ్రామానికి రోడ్లు వేయాలని, మంచినీటిని సమకూర్చాలని డిమాండ్‌ చేస్తూ దసమంతపూర్‌ సమితి లుల్లా పంచాయతీ పదుగుడ గ్రామ ప్రజలు ఎంతో కాలంగా అధికారులకు విన్నవించుకుంటున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ప్రజలు ఎన్నికలు బహిష్కరించారు. ఆ గ్రామంలో 90 ఆదివాసీ కుటుంబాలకు చెందిన 450 మంది నివసిస్తున్నారు. వారిలో 176 మంది ఓటర్లు ఉన్నారు. వారి కోసం ఒక పోలింగ్‌ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. అయితే ఎన్నికలు బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు. విషయం తెలుసుకున్న దసమంతపూర్‌ బీడీవో మిలన్‌ కుమార్‌ ఝంకార్‌ గ్రామానికి వెళ్లి ప్రజలకు నచ్చ చెప్పినా వారు వినలేదు. తమ గ్రామానికి రోడ్డు, మంచినీటి సౌకర్యం కల్పించినప్పుడే ఓటు హక్కును వినియోగించుకుంటామని భీస్మించడంతో అదికారులు వెనుదిరిగారు.

నందపూర్‌ సమితిలో..

నందపూర్‌ సమితి రయిసింగ్‌ పంచాయతీ దేవసొండిగుడ గ్రామస్తులు కూడా ఎన్నికలు బహిష్కరించారు. తమ గ్రామానికి రోడ్డు వేయాలని, బాసికీ నదిపై వంతెన నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ ఎన్నికలు బహిష్కరించారు. అంతేకాకుండా గ్రామ మార్గానికి అడ్డంగా వెదురులతో దడికట్టి తమ డిమాండ్‌లతో కూడిన బ్యానర్‌ కట్టారు.

నారాయణపట్న సమితిలో..

నారాయణపట్న సమితిలో నాలుగు గ్రామాల ప్రజలు తమకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించలేదంటూ ఎన్నికలు బహిష్కరించారు. అయితే విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో గ్రామాలకు వెళ్లి.. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో శాంతించినట్లు సమాచారం. అలాగే నవర్డపూర్‌ జిల్లాలో కూడా పలుగ్రామాల ప్రజలు ఎన్నికలు బహిష్కరించారు. తెంతులికుంటీ, లమతాగుడ, ఖుండియగుడ గ్రామస్తులు సైతం ఎన్నికలు బహిష్కరించారు. తమ గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయా గ్రామస్తులు వాపోయారు. ఈ గ్రామాల్లో 609 మంది ఓటర్లు ఓటు వేయలేదు. అలాగే రాయిఘర్‌ సమితిలోని ఖుడుకో పంచాయతీ పరిధిలోని 17 గ్రామాల్లో ఉన్న 2,100 మంది ఓటర్లు సమస్యలు పరిష్కరించనందుకు నిరసనగా ఎన్నికలు బహిష్కరించారు.

ఎన్నికలు మాకొద్దు..!
1/3

ఎన్నికలు మాకొద్దు..!

ఎన్నికలు మాకొద్దు..!
2/3

ఎన్నికలు మాకొద్దు..!

ఎన్నికలు మాకొద్దు..!
3/3

ఎన్నికలు మాకొద్దు..!

Advertisement
 
Advertisement
 
Advertisement