మూతపడిన పేపరుమిల్లు! | Sakshi
Sakshi News home page

మూతపడిన పేపరుమిల్లు!

Published Thu, May 16 2024 1:10 PM

మూతపడిన పేపరుమిల్లు!

ముడిసరుకు కొరత
● కార్మికుల ఆందోళన

జయపురం: జయపురం సమీపంలోని గగణాపూర్‌ సేవా పేపరుమిల్లులో పేపరు ఉత్పాదన మరోసారి నిలిచి పోయింది. ముడిసరుకు కొరత కారణంగా ఉత్పాదన ఆగిపోయినట్లు తెలిసింది. మిల్లులో ఉత్పాదన నిలిచి పోవటంతో శ్రామికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మిల్లులో ఇటువంటి పరిస్థితిలు తరచూ జరుగుతూనే ఉన్నాయని.. అందుకు అనేక కారణాలను యాజమాన్యం చూపుతోందని శ్రామికులు ఆరోపిస్తున్నారు. పేపరుమిల్లులో ఉత్పత్తి కోసం రెండు మిషన్లు ఉన్నాయి. ఒక్కో మిషన్‌ సామర్ధ్యం 100 మెట్రిక్‌ టన్నులు. కాగా ఒక మిషన్‌ మాత్రమే పనిచేస్తుందని.. అందువలన నెలకు మూడు వేల టన్నుల పేపరు ఉత్పత్తి అవుతున్నదని వారు వెల్లడించారు. ముడిసరుకు లేక పోవటంతో ఉత్పత్తి నిలిచి పోవటంతో తమకు జీతాలు కూడా యాజమాన్యం చెల్లించలేదని, ఇప్పటికే తమకు ఐదు నెలల జీతాలు యాజమాన్యం బకాయి ఉన్నట్టు కార్మికులు చెబుతున్నారు. పూర్తిస్థాయిలో మిల్లులో ఉత్పత్తి ప్రారంభించాలని, బకాయి జీతాలు చెల్లించాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement