వసతులు కల్పించాలి | Sakshi
Sakshi News home page

వసతులు కల్పించాలి

Published Wed, May 8 2024 9:50 AM

 వసతులు కల్పించాలి

దుబ్బాక: 13వ తేదీన జరిగే పార్లమెంట్‌ ఎన్నికలకు పోలింగ్‌ స్టేషన్లలో అన్ని వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్‌, దుబ్బాక అసిస్టెంట్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి గరీమా అగర్వాల్‌ అన్నారు. మంగళవారం దుబ్బాక ఐఓసీ కార్యాలయంలో నియోజకవర్గంలోని పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల విధులను సిబ్బంది బాధ్యతతో నిర్వహించాలన్నారు. పోలింగ్‌స్టేషన్‌లలో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ఇద్దరు వలంటీర్లు, వీల్‌చైర్‌ అందుబాటులో ఉంచాలన్నారు. సమావేశంలో డీపీఓ దేవకీదేవి, డీఎల్‌పీఓ మల్లికార్జున్‌, ఏఎఆర్‌ఓ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌, దుబ్బాక

ఏఆర్‌ఓ గరీమా అగర్వాల్‌

Advertisement
 
Advertisement
 
Advertisement