Amit Panghal Challenged In High Court Over Trial Exemption In Asian Games, Details Inside - Sakshi
Sakshi News home page

Asian Games 2023: వినేశ్‌ ఫొగాట్‌, భజరంగ్‌ల వ్యవహారంపై హైకోర్టుకు అంతిమ్‌ పంఘల్‌

Published Wed, Jul 19 2023 11:30 AM

Amit Panghal Challenge-Vinesh Phogat-HighCourt-Trial Exemption-Asian Games - Sakshi

ఒలింపిక్‌ పతక విజేత బజరంగ్, ఆసియా గేమ్స్‌ చాంపియన్‌ వినేశ్‌ ఫొగాట్‌ ట్రయల్స్‌ లేకుండానే ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు బెర్త్‌లు పొందిన సంగతి తెలిసిందే. పురుషుల 65 కేజీల కేటగిరీలో బజరంగ్‌... మహిళల 53 కేజీల విభాగంలో వినేశ్‌ చైనాలో జరిగే ఆసియా క్రీడల్లో పోటీ పడతారు. అయితే ఈ విభాగాల్లోనూ ట్రయల్స్‌ నిర్వహించి విజేతలను స్టాండ్‌బైగా అక్కడికి తీసుకెళ్తారు. ఈ విషయం పక్కనబెడితే.. వినేశ్‌ ఫొగాట్‌కు ఎలాంటి ట్రయల్స్‌ లేకుండానే నేరుగా ఆసియా గేమ్స్‌లో పాల్గొనడంపై యువ రెజ్లర్‌ అంతిమ్‌ పంఘల్‌ తప్పుబడుతూ హైకోర్టులో చాలెంజ్‌ చేశాడు. 

ఇదే విషయంపై అంతిమ్‌ పంఘల్‌ చిన్ననాటి కోచ్‌ వికాష్‌ భరద్వాజ్‌ మాట్లాడుతూ.. ''ట్రయల్స్‌ లేకుండానే వినేశ్‌, భజరంగ్‌లను ఆసియా గేమ్స్‌ ఆడనివ్వడంపై హైకోర్టుకు వెళ్తున్నాం. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం. డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ చీఫ్‌ బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేసిన ఆందోళనలో యువ రెజ్లర్లు కూడా ఉన్నారు. కానీ డబ్ల్యూఎఫ్‌ఐ కేవలం సీనియర్లకు మాత్రమే అవకాశమిచ్చి సాక్షి మాలిక్‌ లాంటి జూనియర్లకు ఆసియా గేమ్స్‌కు ఎందుకు ట్రయల్స్‌ లేకుండా పంపించడం లేదు. ఇది కరెక్ట్‌ కాదు. అందరికి ట్రయల్స్‌ నిర్వహించాల్సిందే. ఎవరిని డైరెక్ట్‌గా ఎంపిక చేయకూడదు. దీనిపై పోరాడుతాం'' అంటూ తెలిపారు. 

ఇక అంతిమ్‌ పంఘల్‌ ఆసియా గేమ్స్‌లో బాక్సింగ్‌ విభాగంలో 53 కేజీలో కేటగిరిలో పోటీ పడనుండగా.. రెజ్లర్లు భజరంగ్‌ పూనియా 65 కేజీలు.. వినేశ్‌ ఫొగాట్‌ 53 కేజీల విభాగంలో ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇక  ఆసియా గేమ్స్‌ సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 8 వరకు చైనాలోని హాంగ్జూ వేదికగా జరగనున్నాయి.

చదవండి: DopingTest: రెండేళ్లలో 114 మంది క్రికెటర్లకు మాత్రమేనా.. WADA అసహనం

Advertisement
 
Advertisement
 
Advertisement