కోవిడ్‌ సమయంలోనూ ఆపన్నహస్తం | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ సమయంలోనూ ఆపన్నహస్తం

Published Thu, May 16 2024 1:35 PM

కోవిడ్‌ సమయంలోనూ  ఆపన్నహస్తం

కోవిడ్‌ సమయంలో పరిశ్రమలు, దుకాణాలు, హోటళ్లు, మాళ్లు ఇలా అన్నీ మూతపడ్డాయి. పనుల్లేక పేద, మధ్య తరగతి ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. బయటకొస్తే కోవిడ్‌ బారినపడతామనే భయంతో ఇంటికే పరిమితమయ్యారు. ఆ సమయంలోనూ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి కూలీలకు పనులు కల్పించేలా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో కూలీలను ఉపాధి పనులు ఆదుకున్నాయి. కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ కూలీలకు పనులను కల్పించారు. 2020 – 21 ఆర్థిక సంవత్సరంలో 1.10 కోట్ల పనిదినాలను కల్పించగా, కూలీలకు వేతనంగా రూ.220 కోట్లకుపైగా మొత్తాన్ని వారి బ్యాంక్‌ ఖాతాల్లో జమచేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement