నేటి నుంచి బీసీజీ వ్యాక్సినేషన్‌ | Sakshi
Sakshi News home page

నేటి నుంచి బీసీజీ వ్యాక్సినేషన్‌

Published Thu, May 16 2024 12:50 PM

నేటి

ప్రశాంతి నిలయం: క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు ఈనెల 16వ తేదీ (గురువారం) నుంచి జిల్లాలో అడల్ట్‌ బీసీజీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమ నిర్వహణపై బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్‌ మంజువాణి తన కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...అడల్ట్‌ బీసీజీ వ్యాక్సినేషన్‌లో భాగంగా 18 సంవత్సరాల వయస్సు పైబడిన వారందరికీ టీకా వేస్తారన్నారు. ఈనెల 16న ప్రారంభం కానున్న వ్యాక్సినేషన్‌ మూడు నెలల పాటు కొనసాగుతుందన్నారు. ప్రతి గురువారం జిల్లాలోని 544 సచివాలయాల్లో వ్యాక్సినేషన్‌ చేస్తారన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని సూచించారు. సమీక్షలో జిల్లా వ్యాక్సినేషన్‌ అధికారి డాక్టర్‌ నాగేంద్ర నాయక్‌, జిల్లా టీబీ నివారణ అధికారి డాక్టర్‌ తిప్పయ్య, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు.

కల్తీ ఆహార పదార్థాలు

విక్రయిస్తే చర్యలు

జిల్లా ఆహార భద్రత అధికారి తస్లీం

హిందూపురం టౌన్‌: ప్రజారోగ్యానికి భంగం కలిగిస్తూ కల్తీ ఆహార పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఆహార భద్రత అధికారిణి తస్లీం హెచ్చరించారు. బుధవారం ఆమె పట్టణంలోని ‘సరిగమ’, తాడిపత్రి బిర్యాని రెస్టారెంట్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా రెస్టారెంట్‌లలో వండిన ఆహార పదార్థాలను, వండడానికి సిద్ధం చేసిన పదార్థాలను పరిశీలించారు. కొన్ని పదార్థాల నమూనాలు సేకరించారు. ఈ సందర్భంగా తస్లీం మాట్లాడుతూ, రెస్టారెంట్‌ నిర్వాహకులు ఆహార భద్రత శాఖ అనుమతులు తీసుకోకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆహార పదార్థాల్లో నాణ్యత లేకపోయినా, కాలం చెల్లిన ఆహార పదార్థాలను విక్రయించినా ఆహార భద్రత ప్రమాణాల చట్టం కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

నేడు ఏపీఈఏపీ సెట్‌

అనంతపురం: ఏపీ ఈఏపీసెట్‌ గురువారం జరగనుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 29,025 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. అనంతపురం జిల్లాలకు సంబంధించి మొత్తం 8 కేంద్రాలు ఏర్పాటు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలో సంస్కృతి ఇంజినీరింగ్‌ కళాశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ నెల 23 వరకు రెండు సెషన్లలో పరీక్ష జరగనుంది. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.

నేటి నుంచి  బీసీజీ వ్యాక్సినేషన్‌
1/1

నేటి నుంచి బీసీజీ వ్యాక్సినేషన్‌

Advertisement
 
Advertisement
 
Advertisement