● పీజీ, పీజీ డిప్లమో కోర్సులకు ప్రవేశ పరీక్ష ● 22వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ | Sakshi
Sakshi News home page

● పీజీ, పీజీ డిప్లమో కోర్సులకు ప్రవేశ పరీక్ష ● 22వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

Published Fri, May 17 2024 4:35 AM

● పీజ

జ్యోతిరావు పూలే కళాశాలలకు విద్యార్థుల ఎంపిక

బొబ్బిలి: మండలంలోని కోమటిపల్లి వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాలలో పదో తరగతి ఉత్తీర్ణులైన 13 మంది విద్యా ర్థులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే జూనియర్‌ కళాశా లల్లో ఇంటర్మీయట్‌ ప్రవేశాలకు అర్హత సాధించారని ప్రిన్సిపాల్‌ గుణుపూరు పురుషోత్తం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పి.ప్రశాంత్‌, ఎన్‌.మహేష్‌, కె.కె.ఎస్‌.ఎస్‌.గౌతమ్‌, బి.తరుణ్‌, వై.యశ్వంత్‌, ఎన్‌.ధనుంజయ, ఆర్‌.మురళీకృష్ణలు విశాఖపట్నం జిల్లా సింహాచలంలోని కళాశాలకు, పి.వినయకుమార్‌ దొ ర, ఒ.సాయి, బి.రవిప్రకాశ్‌లు చిత్తూరు జిల్లా సౌధంలోని కళాశాలకు, పి.హేమంత్‌ నాయు డు, టి.రవీంద్ర నెల్లూరు జిల్లాలోని దొరవారి సత్రంలోని కళాశాలకు ఎంపికయ్యారన్నారు. విద్యార్థులను ప్రిన్సిపాల్‌, సిబ్బంది అభినందించారు.

తమ్మిరెడ్డికి డాక్టరేట్‌

వంగర: మండల పరిధి మగ్గూరు గ్రామానికి చెందిన సినీగీత రచయిత తమ్మిరెడ్డి ఉమామహేశ్వరరావుకు డాక్టరేట్‌ లభించింది. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు విభాగంలో గోల్డ్‌మెడల్‌ సాధించిన అనంతరం ఆచార్య ఎల్లూరి శివారెడ్డి (తెలంగాణ సారస్వ త పరిషత్‌ అధ్యక్షుడు) పర్యవేక్షణలో ‘తెలుగు చలన చిత్ర గీతాలు–రసభావచిత్రణ’ అనే అంశంపై పరిశోధన చేశారు. దీంతో ఆయనకు యూనివర్సిటీ డాక్టరేట్‌ పట్టాను అందజేశారు. 30 సినిమాల్లో వందకు పైగా గీతాలు రచించి ఈ ప్రాంత ప్రజల్లో అరుదైన గుర్తింపు పొందిన ఉమామహేశ్వరరావుకు డాక్టరేట్‌ లభించడంతో ప్రజలు ఆయనను అభినందిస్తున్నారు.

గిరిజన వర్సిటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

విజయనగరం అర్బన్‌: కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ లో 2024–25 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించిన ప్రవేశ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలైంది. యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ టీవీ కట్టిమణి నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాల ను గురువారం వెల్లడించారు. పీజీ ప్రొగ్రామ్‌ల కు దరఖాస్తు చేసుకునేవారు పూర్తి వివరాలకు ‘సీటీయూఏపీ.ఏసీ.ఐఎన్‌’ వెబ్‌సైట్‌లో చూడాలన్నారు. అర్హులై న విద్యార్థులు ఈ నెల 22వ తేదీ రాత్రి 11.55 నిమిషాలలోపు రిజిస్టర్‌ చేసుకోవాలని, మరిన్ని వివరాల కోసం యూనివ ర్సిటీ క్యాంపస్‌లో ఏర్పాటుచేసిన హెల్ప్‌ డెస్క్‌ ను లేదా, మొబైల్‌ నంబర్‌ 63004 43499ను యూనివర్సిటీ పనివేళల్లో సంప్రదించాలని సూచించారు.

యూనివర్సిటీలో నిర్వహించే కోర్సులివే...

యూనివర్సిటీలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, ఎంఏ ట్రైబల్‌ స్టడీస్‌, ఎంఏ సోషియాలజీ, ఎంఏ ఇంగ్లిష్‌, మాస్టర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ (ఎంఎస్‌డబ్ల్యూ), మాస్టర్‌ ఆఫ్‌ జర్నలిజమ్‌ అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్స్‌, ఎంబీఏ రెండేళ్ల పీజీ కోర్సును ఏర్పాటు చేశారు. ఈ కోర్సునకు ఏదైనా మూడేళ్ల డిగ్రీ కోర్సు పూర్తిచేసి ఉండాలి. కేంద్ర ప్రభుత్వ రిజర్వేషన్‌ పాలసీని అనుసరించి ప్రవేశ పరీక్ష మెరిట్‌ ఆధారంగా గిరిజనులకు, గిరిజనేతరులకు ప్రవేశాలు కల్పిస్తామని వీసీ తెలిపారు.

సమాచారం ఇచ్చాకే పోస్టల్‌ బ్యాలెట్‌ల తరలింపు

విజయనగరం అర్బన్‌: విజయనగరం తహసీల్దార్‌ కార్యాలయంలోని స్ట్రాంగ్‌రూమ్‌లో ఉన్న విజయనగరం ఎంపీ స్థానం పరిధిలోని పోస్టల్‌ బ్యాలెట్‌లను కలెక్టరేట్‌కు గురువారం తరలించామని జేసీ కె.కార్తీక్‌ తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సమాచారం ఇచ్చామని, హాజరైనవారి సమక్షంలోనే తరలింపు, భద్రపరచడం, సీల్‌ వేయడం జరిగిందన్నారు. విజయనగరం రిటర్నింగ్‌ అధికారి సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌ ప్రక్రియను వీడియో రికార్డింగ్‌ తో పాటు చేపట్టామని తెలిపారు. కొన్ని పార్టీల అభ్యర్థులకు సమాచారం ఇవ్వకుండా పోస్టల్‌ బ్యాలెట్‌లు తరలించారన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. అన్ని రికార్డింగ్‌లు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలో సాగిన కార్యక్రమంపై అపోహలు వీడాలన్నారు.

గిజబలో ఏనుగుల గుంపు

గరుగుబిల్లి: గిరిజన ప్రజలను ఏనుగులు బెడ ద వీడడం లేదు. కొద్ది నెలల నుంచి కొమరాడ, జియ్యమ్మవలస మండల పరిధిలో సంచరిస్తు న్న ఏనుగులు గురువారం గిజబ, నంది వానివలస గ్రామాల పరిసరాల్లోకి చేరుకున్నాయి.

● పీజీ, పీజీ డిప్లమో కోర్సులకు  ప్రవేశ పరీక్ష ● 22వ తేద
1/1

● పీజీ, పీజీ డిప్లమో కోర్సులకు ప్రవేశ పరీక్ష ● 22వ తేద

Advertisement
 
Advertisement
 
Advertisement