అకాల వర్షం.. అపార నష్టం | Sakshi
Sakshi News home page

అకాల వర్షం.. అపార నష్టం

Published Wed, May 15 2024 5:25 AM

అకాల

నల్లబెల్లి/నర్సంపేట రూరల్‌: జిల్లాలోని పలు గ్రామాల్లో మంగళవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. పలు ఇళ్ల రేకులు కొట్టుకు పోయాయి. విద్యుత్‌ స్తంభాలు విరిగిపడి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నల్లబెల్లి మండలంలోని మేడపల్లి, రాంపూర్‌, ఆసరవెల్లి, గొల్లపల్లి, గోవిందాపూర్‌, గుండ్లపహాడ్‌, నల్లబెల్లి తదితర గ్రామాల్లో వడగళ్ల వాన కురిసింది. ఆయా గ్రామాల్లో చెట్లు నేలకొరిగాయి. మామిడికాయలు రాలిపోయాయి. వరి పంటలు దెబ్బతిన్నాయి. అదేవిధంగా నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో భూషబోయిన తిరుపతి ఇంటి రేకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆసమయంలో ఇంట్లో ఉన్న తిరుపతిపై పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. అదే గ్రామ పంచాయతీ శివారులోని బుచ్చినాయక్‌తండాకు చెందిన అజ్మీరా రవి ఇంటి పైకప్పు గాలివానకు కొట్టుకుపోయింది. అకాల వర్షంతో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని పలు గ్రామాల బాధితులు కోరుతున్నారు.

అకాల వర్షం.. అపార నష్టం
1/1

అకాల వర్షం.. అపార నష్టం

Advertisement
 
Advertisement
 
Advertisement