భూగర్భ జలాలు పెంపొందించుకోవాలి | Sakshi
Sakshi News home page

భూగర్భ జలాలు పెంపొందించుకోవాలి

Published Fri, May 17 2024 5:40 AM

భూగర్భ జలాలు పెంపొందించుకోవాలి

వర్ధన్నపేట: భూగర్భజలాల పెంపొందించుకోవడానికి ఇంకుడు గుంతలు, ఫామ్‌ పాండ్స్‌ ఏర్పాటు చేసుకుని నీటిని పొదుపు చేసుకోవాలని సెంట్రల్‌ వాటర్‌ బోర్డు సైంటిస్ట్‌ ఎంఎస్‌ గౌతమ్‌ అన్నారు. మండలంలోని ఇల్లంద గ్రామంలో ఉపాధి హామీ పనులు, భూగర్భ జలాల పెంపుకోసం చేపట్టిన ఫాం పాండ్స్‌ తదితర పనులను గురువారం సెంట్రల్‌ వాటర్‌ బోర్డు సభ్యుల బృందం మండలంలోని పరిశీలించింది. ఈ సందర్భంగా బృందం ప్రతినిధి ఎంఎస్‌ గౌతమ్‌ గ్రామైక్య సంఘాల మహిళతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. భూగర్భ జలాలు పెంపొందించుకుని నీటిని పొదు పు చేయడం ద్వారా భూగర్భ జలాలు అడుగంట కుండా ఉంటాయన్నారు. దక్షిణ భారతదేశంలో 7 గ్రామాలు జాతీయ స్థాయి వాటర్‌ అవార్డులకు ఎంపికై నట్లు తెలిపారు. ఉపాధి హామీ పనులను సందర్శించి నీటి సంరక్షణ, వినియోగం ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో ఉపాధి హామీ పనులపై బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. అనంతరం ప్రతినిధి గౌతమ్‌తోపాటు సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ బృందం వెంట డీఆర్‌డీఓ కౌసల్యదేవి, ఎంపీడీఓ వెంకటరమణ, తహసీల్దార్‌ విజయసాగర్‌, ఎంపీఓ ధనలక్శ్‌మి, ఈజీ ఎస్‌ విభాగం అధికారులు రమేశ్‌, సురేశ్‌, నాగరాజు , సుధాకర్‌, సెర్ప సిబ్బంది వేణు, గోలి కొమురయ్య, ఎఫ్‌ఏ రేణుక, వీఓల ప్రతినిధులు అనూష, భాను, శ్రావణి, రజిత, స్వప్న, వీఓఎలు శోభ, స్రవంతి, పద్మావతి, రమ పాల్గొన్నారు.

సెంట్రల్‌ వాటర్‌ బోర్డు సైంటిస్ట్‌ గౌతమ్‌

Advertisement
 
Advertisement
 
Advertisement