Sakshi News home page

EMI: లోన్ తీసుకున్నవారికి షాక్.. ఈ రెండు బ్యాంకుల్లో వడ్డీ రేట్లు పెరిగిపోయాయ్!

Published Sun, Sep 3 2023 5:09 PM

Icici and punjab national bank MCLR increased details - Sakshi

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రెపో రేట్లను ఏ మాత్రం పెంచకుండా యధాతధంగా ఉంచినప్పటికి.. రెండు బ్యాంకులు మాత్రం లోన్ వడ్డీ రేట్లను పెంచాయి. దీంతో రుణ గ్రహీత కట్టాల్సిన ఈఎమ్ఐ అమాంతం పెరిగింది. ఇంతకీ వడ్డీ రేట్లను పెంచిన బ్యాంకులేవీ? ఎంత శాతం వడ్డీ పెంచిందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం.. ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెండూ కూడా తమ మార్జినల్ కాస్ట్-బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) పెంచింది. పెరిగిన ఈ రేట్లు 2023 సెప్టెంబర్ 01 నుంచి అమలులోకి వచ్చాయి. కావున ఎవరైతే ఈ బ్యాంకుల్లో లోన్ తీసుకుని ఉంటారో వారు కట్టాల్సిన ఈఎమ్ఐలు పెరిగాయి. 

ఐసీఐసీఐ బ్యాంక్..
ఐసీఐసీఐ బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్-బేస్డ్ లెండింగ్ రేట్లను 5 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. కావున ఓవర్ నైట్, ఒక నెల ఎంసీఎల్ఆర్ 8.45 శాతం & మూడు నెలలు, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ వరుసగా 8.50 శాతం, 8.85 శాతంగా ఉన్నాయి. ఒక సంవత్సరం ఎంసీఎల్ఆర్ 8.95 శాతానికి చేరింది.

  • ఓవర్ నైట్ 8.45%
  • ఒక నెల 8.45%
  • మూడు నెలలు 8.50%
  • ఆరు నెలలు 8.85%
  • ఒక సంవత్సరం 8.95%

ఇదీ చదవండి: నెలకు రూ. 40.50 లక్షలు రెంట్ ఇవ్వడానికి రెడీ.. అట్లుంటది కుబేరుడంటే?

పంజాబ్ నేషనల్ బ్యాంక్..
పంజాబ్ నేషనల్ బ్యాంక్ విషయానికి వస్తే.. ఇది కూడా ఐదు బేసిస్ పాయింట్ల మార్జినల్ కాస్ట్-బేస్డ్ లెండింగ్ రేట్లను పెంచింది. దీంతో ఈ బ్యాంక్ ఓవర్ నైట్ బెంచ్‌మార్క్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ 8.5 శాతం నుంచి 8.15 శాతానికి పెరిగింది. ఒక నెల, మూడు నెలలు, ఆరు నెలలకు సంబంధించిన రేట్లు వరుసగా 8.25 శాతం, 8.35 శాతం, 8.55 శాతానికి పెరిగాయి. ఒక సంవత్సరం ఎంసీఎల్‌ఆర్‌ 8.65 శాతానికి, మూడేళ్ల ఎంసీఎల్‌ఆర్‌ను 8.90 శాతం నుంచి 8.95 శాతానికి పెంచారు.

  • ఓవర్ నైట్ 8.15%
  • ఒక నెల 8.25%
  • మూడు నెలలు 8.35%
  • ఆరు నెలలు 8.55%
  • ఒక సంవత్సరం 8.65%
  • మూడు సంవత్సరాలు 8.95%

Advertisement

తప్పక చదవండి

Advertisement