ఇషా అంబానీ ప్రయత్నం ఫలిస్తుందా..? | Sakshi
Sakshi News home page

ఇషా అంబానీ ప్రయత్నం ఫలిస్తుందా..?

Published Wed, Mar 6 2024 3:20 PM

Isha Ambani Plan To Bring British Luxury Brand To India  - Sakshi

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వ్యాపార సామ్రాజ్యంలో ముఖేశ్‌అంబానీ మూడోతరానికి పాలనా పగ్గాలు ఎప్పుడో అప్పజెప్పారు. తన వ్యాపార బాధ్యతలను చూసుకునే భవిష్యత్‌ లీడర్లు వీరేనంటూ వారసులు ఆకాశ్, ఈశా, అనంత్‌ అంబానీల పేర్లను గతంలోనే ప్రకటించారు.

రిలయన్స్ రిటైల్ వ్యాపార బాధ్యతలు ఇషా అంబానీ చేతికి వచ్చిన తర్వాత కంపెనీ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. అంబానీ కుమార్తె అనేక విదేశాలకు చెందిన ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్లను దేశంలోని వినియోగదారులకు పరిచయం చేస్తూ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటున్నారు.

రిలయన్స్ రిటైల్‌ ఇండస్ట్రీస్ బ్రిటీష్ ఫ్యాషన్ లేబుల్ ప్రిమార్క్‌ను భారత మార్కెట్లో విడుదల చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ ఒప్పందం జరిగితే టాటాకు చెందిన జూడియో, ల్యాండ్‌ మార్క్‌ గ్రూప్‌నకు చెందిన మ్యాక్స్, షాపర్స్ స్టాప్‌.. వంటి ప్రత్యర్థులకు రిలయన్స్ ఫ్యాషన్ పోటీ ఇవ్వనుందని పరిశ్రమ వర్గాలు తెలియజేస్తున్నాయి. వాస్తవానికి బ్రిటీష్ ప్రిమార్క్ బ్రాండ్ ఖరీదైన దుస్తులు, పాదరక్షలకు ప్రసిద్ధి చెందింది. రిలయన్స్-ప్రిమార్క్ మధ్య జాయింట్ వెంచర్ లేదా లైసెన్సింగ్ ఒప్పందం జరగనున్నట్లు తెలుస్తోంది.

ఈ ఒప్పందం వార్తలు రాకముందు ప్రిమార్క్‌ ఇండియాలో వ్యాపారాన్ని విస్తరించే దిశగా అడుగులువేసినట్లు తెలిసింది. ప్రత్యేక రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. బ్రిటిష్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని కంపెనీని మరింత లాభాల్లోకి తీసుకువెళ్లనున్నట్లు రిలయన్స్‌ రిటైల్‌ అధికారులు తెలిపారు. 

ఇదీ చదవండి: అత్తకు తగ్గ కోడలు.. నాట్యంలో దిట్ట..

ప్రిమార్క్‌ కంపెనీ లండన్ లిస్టెడ్ అసోసియేటెడ్ బ్రిటిష్ ఫుడ్స్ యాజమాన్యం పరిధిలో ఉంది. ఈ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 400 స్టోర్లను కలిగి ఉంది. 2026 చివరి నాటికి 530 అవుట్‌లెట్‌లను ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ మెజారిటీ దుస్తులను చైనా నుంచి కొనుగోలు చేసి విక్రయిస్తోంది. కంపెనీ తన ఉత్పత్తులను తక్కువ ధరలకు విక్రయిస్తోంది. మహిళా కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని ప్రిమార్క్‌ ఉత్పత్తులు తయారుచేస్తున్నారు.

Advertisement
Advertisement