‘నా జీవితాన్ని నాశనం చేయొద్దు నాన్న’! | Sakshi
Sakshi News home page

‘నాన్న మీరే నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు’..11 ఏళ్ల కూతురి ఆవేదన!

Published Mon, Jan 29 2024 6:54 PM

11-Year-Old Gamer Daughter Said Father Ruining Her Life After Not Buying Her iPhone 15 Pro Max - Sakshi

ఐఫోన్‌! పరిచయం అక్కర్లేని పేరు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు యాపిల్‌ తయారు చేసిన ఐఫోన్‌లను అంటే మక్కువ. కానీ సెలబ్రిటీలు ఐఫోన్‌ను కొనుగోలు చేస్తున్నా దాని ధర కారణంగా సామాన్యులకు అందని ద్రాక్షలాగే మిగిలిపోతుంది. ఇప్పుడు అలాంటి కాస్ట్లీ ఐఫోన్‌ని కావాలని ఓ 11 ఏళ్ల అమ్మాయి మారం చేస్తోంది. అందుకు ఆ చిన్నారి  తండ్రి ఏం చేశాడు. 
 
గత దశాబ్దకాలంగా లేటెస్ట్‌గా మార్కెట్‌లో విడుదలవుతున్న గాడ్జెట్‌లు ఎంత ఖరీదైనవి అయినప్పటికీ పిల్లలు సైతం వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వాటిల్లో యాపిల్‌ తయారు చేసిన ఐఫోన్‌తో పాటు ఇతర ఉత్పత్తులు ప్రత్యేకం.

నాకు ఐఫోన్‌ 15 కావాలి
తాజాగా, ఓ తండ్రిని తన 11 ఏళ్ల కుమార్తె ఐఫోన్‌ 15 కొనిపెట్టమని అడిగింది. అందుకు అతను సున్నితంగా తిరస్కరించాడు. అంత ధర పెట్టి ఫోన్‌ కొనుగోలు చేయకూడదని సర్ధి చెప్పే ప్రయత్నం చేశాడు. సరే కుమార్తె అడిగింది కదా.. పోనీలే అని కెమెరా పనితనం, బ్యాటరీ లైఫ్‌టైం బాగుందనే ఉద్దేశ్యంతో ఐఫోన్‌ 13 ఫోన్‌ని కొనుగోలు చేస్తానని మాటిచ్చాడు. 

ఐఫోన్‌ 13 కొనిస్తా నాన్న
అందుకు కుమార్తె ససేమిరా అన్నది. ‘నాకు 11 ఏళ్ల కుమార్తె ఉంది. రెండేళ్ల క్రితం ఆమెకు నా పాత ఐఫోన్‌ 8ని ఇచ్చాను. ఆ ఫోన్‌తో తన స్నేహితులతో మాట్లాడుకునేందుకు, సోషల్‌ మీడియాను వాడుతుంది. ఇటీవల ఆమె స్నేహితులు కొత్త ఫోన్‌లను కొనుగోలు చేశారు. తనకి కూడా కొత్త ఫోన్‌ కావాలని మారం చేస్తోంది. నా ఫోన్‌ పాతది. నా స్నేహితులు కొత్త ఫోన్‌లు కొనుక్కున్నారు. నా క్కూడా కొత్త ఫోన్‌ కొనిపెట్టమని అడుగుతుంది. సరే నా కూతురు ఫోన్‌ అడిగిందని ఐఫోన్‌ 13ని కొనుగోలు చేసేందుకు సిద్ధపడ్డా. ఇతర లేటెస్ట్‌ ఐఫోన్‌ సిరీస్‌లు ఎలా ఉన్నాయో.. ఆ ఫోన్‌ కూడా అలాగే ఉంది. ధర కూడా 600 డాలర్లు. 



అయితే, ఆఫోన్‌ 120హెచ్‌జెడ్‌ డిస్‌ప్లే ఉందని, గేమ్స్‌ ఆడుకునేందుకు ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ని కోరుకుంటుంది. ఆ ఫోన్‌ కూడా అంతే 120 హెచ్‌జెడ్‌ డిస్‌ప్లేగా ఉందిగా. ఐఫోన్ 15 కొనడం డబ్బు వృధా అని భావించాను.  కానీ నా నిర్ణయాన్ని నా 11 ఏళ్ల కుమార్తె విభేదించింది. మీరే నా జీవితాన్ని నాశనం చేస్తున్నారని అంటోంది.   

గడుగ్గాయ్‌.. చివరికి అనుకున్నది సాధించింది
‘నా కుమార్తె గేమర్. పాతది అయినందున తన ఫోన్ సరిగ్గా గేమ్ చేయడం లేదని ఎప్పుడూ ఫిర్యాదు చేస్తూ ఉంటుంది. ఆమె ఐఫోన్ 13ని కొనిస్తానని నేను ఇప్పటికే చెప్పాను. కానీ ఆమె ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ కావాలని మొండిగా ప్రవర‍్తిస్తుంది. ఏం చేయాలో పాలుపోవడం లేదంటూ సోషల్‌ మీడియాలో వాపోయాడు తండ్రి. చివరికి తన కుమార్తెకు ఐఫోన్‌ 15 మ్యాక్స్‌ ప్రోని కొనిచ్చి సంతోష పెట్టిందని అన్నాడు.

ఈ పోస్ట్‌పై నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇంత చిన్న వయస్సు అంత ఖరీదైన ఫోన్‌ కొనొద్దని, పిల్లలకు అతిగారాభం మంచిది కాదని సలహా ఇస్తున్నారు.

Advertisement
Advertisement