Sakshi News home page

ప్రెగ్నెన్నీ సమయంలో పిల్లి మాంసం తినడంతో..పాపం ఆ బిడ్డ..!

Published Tue, Apr 16 2024 12:04 PM

Child Has Werewolf Syndrome Because Mom Ate Cat During Pregnancy - Sakshi

మన పెద్దవాళ్లు ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకునే ఆహారాలు బిడ్డపై ఎఫెక్ట్‌ చూపిస్తాయని పదేపదే చెప్పేవారు. అది ఎంతవరకు నిజమో గానీ!.. ఇక్కడొక మహిళ ఎదుర్కొంటున్న పరిస్థితిని చూస్తే అది నిజమేనేమో..! అని అనుకుంటారు. ఆమె తన పరిస్థితిని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. 

ఏం జరిగిందంటే..ఫిలిప్పీన్స్‌కు చెందిన అల్మా అనే మహిళకు రెండేళ్ల కొడుడు జారెన్ గమోంగన్ ఉన్నాడు. అతడు ముఖం, శరీరాన్ని కప్పి ఉంచేలా పెద్ద వెంట్రుకలతో జన్మించాడు. దీన్ని అరుదైన 'వేర్‌వోల్ఫ్ సిండ్రోమ్'గా పిలుస్తారు. ఇలాంటి కేసులు ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 నుంచి 100 వరకు ఉన్నాయి. అయితే జారెన్‌ కడుపులో ఉండగా తల్లి అల్మా అడవి పిల్లులు తినాలనే కోరిక ఎక్కువగా ఉండేదట. అదీగాక అక్కడ అపయావో ప్రాంతంలో పిల్లితో చేసే వంటకం బాగా ప్రసిద్ధి. దీంతో ఒక రోజు నల్లపిల్లిని తెచ్చుకుని వండుకుని తింది.

అప్పుడు ఆమెకు ఏమి అనిపించలేదు. ఎప్పుడైతే తన కొడుకు ఇలా మెడ, వీపు, చేతులు, ముఖంపై ఓ ఎలుగుబంటి మాదిరిగా జుట్టుతో ఉండటంతో పశ్చాత్తాపం చెందడం మొదలు పెట్టింది అల్మా. తాను గర్భవతిగా ఉండగా ఆ నల్లపిల్లిని తినడం కారణంగా తన కొడుకు ఇలా పుట్టాడని, ఆ పిల్లి శాపం తనకు తగిలిందని కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. తోటి స్థానికులు, గ్రామస్తులు కూవా అల్మాతో అడవి పిల్లి తినడం వల్లే ఇలా జరిగిందని అనడంతో దాన్నేనమ్మడం మొదలు పెట్టింది. ఐతే అందుకు సరైన ఆధారాలు మాత్రం లేవు.

ఇక్కడ ఆమె జారెన్‌ కంటే ముందు ఓ కుమార్తె ఉంది. ఆమెకు ఈ పరిస్థితి లేదు. కొడుకు అరుదైన పరిస్థితిని చూసి అల్మా తాను చేసిన పనికి నిందించుకుంటూ విలపిస్తోంది. వైద్యులను ఆశ్రయించినా అల్మాకు నిరాశ ఎదురయ్యింది. ఎందుకంటే వైద్యులు అల్మా కొడుకు జారెన్‌కు అనేక వైద్య పరీక్షలు చేసి అతడు హైపర్‌ట్రికోసిస్ అనే అరుదైన వైద్య పరిస్థితితో బాధపడుతున్నట్లు తెలిపారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ డెర్మటాలజీ ప్రకారం..ఈ హైపర్‌ట్రికోసిస్ అనేది సాధారణంగా మానవుడికి ఉండే జుట్టు కంటే అధికంగా ఏ భాగంలోనైనా పెరగొచ్చు. ఇది అరుదైన వ్యాధి అని, దీనికి చికిత్స లేదని తేల్చి చెప్పారు.

అయితే జారెన్‌ ఇలాంటి అరుదైన పరిస్థితితో పుట్టినప్పటికీ మంచి యాక్టివ్‌గా అందరిలానా ఉండటం విశేషం. ఐతే ఒక్కోసారి వేడి వాతావరణంలో ఈ దట్టమైన వెంట్రుకల కారణంగా దురద పుడుతుందని చెబుతున్నాడని అల్మా వాపోయింది. తాను చాలా సార్లు జుట్టుని కత్తిరించడానికి ప్రయత్నించానని, అయితే అది పొడవుగా మందంగా ఉండటంతో కత్తిరించిన కొద్ది దట్టంగా పెరుగుతున్నట్లు చెప్పుకొచ్చింది అల్మా.

అయితే లేజర్ హెయిర్ రిమూవల్ వంటి చికిత్సలు అధిక జుట్టు పెరుగుదలను తగ్గించగలవని వైద్యులు సూచించారు. దీంతో అల్మా, ఆమె భర్త తన కుమారుడి హెయిర్ రిమూవల్ సెషన్‌లకు నిధులు సమకూర్చే పనిలో నిమగ్నమయ్యారు. ఏదీ ఏమైనా ప్రెగ్నెన్సీ సమయంలో శిశువుకి హానికరం అనిపించేవి తీసుకోకుండా ఉంటేనే మంచిది. దేనిల్ల కొన్ని రకాల రుగ్మతలు వస్తాయన్నిది సరిగా వైద్యులు సైతం నిర్థారించలేరు, చెప్పలేరు అనేది గుర్తించుకోండి. 

(చదవండి: సింఘారా పిండి గురించి విన్నారా..? బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!)

Advertisement
Advertisement