చోరీ డెబిట్‌ కార్డుతో లాటరీ.. రూ. 41 కోట్లు గెలిచి.. | Sakshi
Sakshi News home page

UK: చోరీ డెబిట్‌ కార్డుతో లాటరీ.. రూ. 41 కోట్లు గెలిచి..

Published Thu, Apr 18 2024 12:47 PM

Man Bought Lottery from Stolen Debit Card Now won 4 Million Pound - Sakshi

యూకేలో ఓ వింత  ఉదంతం వెలుగు చూసింది. ఈ దేశానికి చెందిన ఇద్దరు దొంగలు లాటరీలో  నాలుగు మిలియన్ పౌండ్లు గెలుచుకున్నాడు. భారత కరెన్సీతో పోల్చిచూస్తే ఈ మొత్తం రూ.41 కోట్ల 66 లక్షలు. ఇంత భారీ ప్రైజ్ మనీ గెలుచుకున్నాక కూడా వారు చిక్కుల్లో పడ్డాడు.  

బోల్టన్‌కు చెందిన జాన్ రాస్ వాట్సన్, మార్క్ గుడ్‌రామ్‌లు తాము చోరీ చేసిన డెబిట్‌ కార్డుతో లాటరీ టిక్కెట్‌ కొనుగోలు చేశారు. ఆ లాటరీ ఫలితాలు రాగానే వారు ఆనందంతో గెంతేశారు. తాము నాలుగు మిలియన్‌ పౌండ్లు అందుకోబోతున్నామంటూ ఉబ్బితబ్బిబయ్యారు. అయితే వారి ఆనందం కొద్దిసేపటికే ఆవిరయ్యింది.  

లాటరీలో వచ్చిన మొత్తాన్ని అందుకునేందుకు వారు లాటరీ నిర్వాహకులను సంప్రదించారు. వారు బ్యాంకు ఖాతా గురించి అడగగా, గుడ్‌రామ్‌ తనకు బ్యాంకు ఖాతా లేదని తెలిపాడు. దీంతోవారు  అనుమానంతో అతనిని పలు విధాలుగా విచారించారు. ఈ నేపధ్యంలో గుడ్‌రామ్‌ ఆ కార్డు తన స్నేహితుడు జాన్‌దని తెలిపాడు. దీంతో వారు జాన్‌ను కూడా విచారించారు. అది అతనిది కూడా కాదని తేలింది. 

లాటరీ నిర్వాహకుల విచారణలో ఆ డెబిట్‌ కార్డు జోషువా అనే వ్యక్తికి చెందినదని తేలింది. దీంతో జాన్ రాస్ వాట్సన్, మార్క్ గుడ్‌రామ్‌లు ఆ కార్డును దొంగిలించారని వారు గుర్తించారు. విషయం పోలీసుల వరకూ చేరింది. కోర్టు విచారణలో జాన్ రాస్ వాట్సన్, మార్క్ గుడ్‌రామ్‌లకు 18 నెలల చొప్పున జైలు శిక్ష పడింది. డెబిట్‌ కార్డు యజమాని జోషువా ఆ లాటరీ మొత్తాన్ని అందుకునేందుకు అర్హుడయ్యాడు. ఈ విషయం తెలిసినవారంతా అదృష్టమంటే ఇదేనేమో  అని అంటున్నారు. 

Advertisement
Advertisement