అవి అవినీతి ప్రభుత్వాలు.. | Sakshi
Sakshi News home page

అవి అవినీతి ప్రభుత్వాలు..

Published Sat, Apr 20 2024 12:05 AM

- - Sakshi

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండింటి తీరు అదే..
● కేంద్రంలో పదేళ్లు మోడీది నీతివంతమైన పాలన ● తెలంగాణ సాధనలో బీజేపీ పాత్ర మరువలేనిది ● కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌
కీలకంగా వ్యయ వివరాల పరిశీలన
మోసపూరిత హామీలతో అధికారంలోకి కాంగ్రెస్‌..

.. ఫిర్యాదు చేయండి

ఎన్నికల వేళ అక్రమాలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల సంఘం సీ – విజిల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

శనివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2024

8లో

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాత్ర మరువలేనిది. రాష్ట్రం ఏర్పడితే నీతివంతమైన పాలన అందుతుందని ప్రజలు ఆశించారు. కానీ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అవినీతిమయంగా మారాయి. బీఆర్‌ఎస్‌ ప్రజలను దోచుకుంటే ప్రజలు ఆ పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో తరిమికొట్టారు. కాంగ్రెస్‌ సైతం ఇదే రీతిలో ముందుకు వెళ్తోంది.’ అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆరోపించారు. ఖమ్మంలో శుక్రవారం బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు నామినేషన్‌ దాఖలు చేయగా.. ఆయన విజయాన్ని కాంక్షిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మంత్రి జెడ్పీ సెంటర్‌లో ప్రసంగించారు. దేశంలో కాంగ్రెస్‌ హయాంలో కుంభకోణాలు జరగగా.. పదేళ్లుగా నరేంద్రమోదీ పాలన మాత్రం అవినీతికి ఆస్కారం లేకుండా సాగుతోందని తెలిపారు. కాంగ్రెస్‌ పాలనలో పేదరికం నిర్మూలిస్తామని చెప్పారే తప్ప చేయలేదని, మోదీ ప్రభుత్వంలో 25 కోట్ల మంది నిరుపేదలను ఉన్నత స్థానానికి చేర్చామని తెలిపారు. ఆయుష్మాన్‌ భారత్‌లో భాగంగా దేశంలో లక్షలాది మందికి ఉచితంగా రూ.5లక్షల వరకు ఆరోగ్య చికిత్స అందించే అవకాశం మోదీ ప్రభుత్వం కల్పించిందన్నారు. కాగా, నీతివంతుడైన, డైనమిక్‌ లీడర్‌ వినోద్‌రావును ఖమ్మం ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపించాలని రాజ్‌నాథ్‌ సింగ్‌ పిలుపునిచ్చారు. ఆపై తాను సైతం ఖమ్మం వచ్చి ఇక్కడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. సేవా రంగంలో వినోద్‌రావు అంకితభావం తిరుగులేనిదని అభినందించారు. కాగా, కేంద్ర మంత్రి ప్రసంగిస్తున్నంత సేపు జై శ్రీరామ్‌, జై భారత్‌, జై మోదీ నినాదాలు మిన్నంటాయి.

కమలం.. కదనోత్సాహం

ఖమ్మంమామిళ్లగూడెం: ఖమ్మంలో కాషాయ శ్రేణులు కదం తొక్కాయి. బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు శుక్రవారం పార్టీ నేతలతో కలిసి నామినేషన్‌ దాఖలు చేశారు. ఆ తర్వాత నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ హాజరు కాగా.. ఆయనకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. సర్దార్‌ సటేల్‌ స్టేడియం వద్ద మొదలైన ర్యాలీ జెడ్పీ సెంటర్‌, వైరా రోడ్‌, పాత బస్టాండ్‌, మయూరిసెంటర్‌ మీదుగా పెవిలియన్‌ గ్రౌండ్‌కు చేరింది. ర్యాలీలో మహిళల కోలాట నృత్యాలు, గిరిజన మహిళలు బిందెల ప్రదర్శన, బోనాలు ఆకట్టుకున్నారు. అలాగే ఆదివాసీ కళాకారులు డప్పు, కొమ్ము నృత్యాలతో సందడి చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ప్లకార్డులను ప్రదర్శించారు. అలాగే, ఎమ్మార్పీఎస్‌ నాయకులు, కార్యకర్తలు మద్దతు తెలిపారు. కాగా, సర్దార్‌ పటేల్‌ స్టేడియానికి హెలీకాప్టర్‌ చేరుకున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు, నాయకులు స్వాగతం పలికారు.

న్యూస్‌రీల్‌

ఖమ్మంలో గెలుస్తున్నాం

ఖమ్మం సహకారనగర్‌/ఖమ్మం మామిళ్లగూడెం: లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం స్థానం నుంచి గెలవడం ఖాయమని బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో నామినేషన్‌ దాఖలు చేశాక మీడియా పాయింట్‌లో, ఆతర్వాత ఖమ్మంలో నిర్వహించిన ర్యాలీలో వారు మాట్లాడారు. దేశవ్యాప్తంగా 400పై చిలుకు స్థానాల్లో గెలవనుండగా, ఆ జాబితాలో ఖమ్మం కూడా ఉంటుందని తెలిపారు. టికెట్‌ ఆశించిన నిరాశకు లోనైన వారు సైతం సహకరిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక హామీలను విస్మరించడంతో ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని తెలిపారు. ఇక బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన అవినీతి, ఆరోపణల నేపథ్యాన ఎమ్మెల్సీ జైలుకి వెళ్లారని చెప్పారు. ప్రజలు ఆలోచన చేసి బీజేపీ గోల్డెన్‌ ప్రభుత్వం కావాలా, కాంగ్రెస్‌ రోల్డ్‌ గోల్డ్‌ కావాలో తేల్చుకోవాలని కోరారు. ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం తనను గెలిపించాలని వినోద్‌రావు పిలుపునిచ్చారు. దేశానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ప్రధాని మోదీ అడుగుజాడల్లో నడుస్తానని తెలిపారు. ఈకార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, రంగాకిరణ్‌, కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, కార్పొరేటర్‌ దొంగల సత్యనారాయణతో పాటు శ్రీకాంత్‌, శీలం పాపారావు, గోంగూర వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement