Sakshi News home page

ప్రముఖ యూట్యూబర్ ప్రైవేట్ వీడియో లీక్.. ఇంటర్నెట్‌లో వైరల్‌

Published Sun, Oct 29 2023 1:32 PM

Pakistani Youtuber Aliza Sehar Private Video Viral - Sakshi

ఇంటర్నెట్, సోషల్ మీడియా రోజురోజుకు ప్రమాదకరంగా మారుతున్నాయి. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే అనేక సంఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్ అలీజా సహర్ ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. అలీజా సహర్ పాకిస్థాన్‌లో ఉన్న ప్రముఖ యూట్యూబర్. అలీజా తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాకిస్థాన్ పల్లెటూరి జీవితాన్ని చూపించేది. ఈ యూట్యూబర్‌కు సంబంధించిన ప్రైవేట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్‌ అవుతుంది.

పాకిస్థానీ యూట్యూబర్ ప్రైవేట్ వీడియో వైరల్
అలీజా సహర్ ప్రతిరోజు తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాకిస్తాన్ గ్రామీణ జీవితాన్ని చూపించేది. దీంతో ఆమె  ఈ ఛానెల్ ద్వారా ప్రజాదరణ పొందింది. యూట్యూబ్, టిక్‌టాక్ ద్వారానే దాదాపు 15 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లను సంపాదించుకుంది. వారందరి కోసం పాకిస్తానీ గ్రామ ప్రజల జీవితం, వంట పద్ధతి, సంస్కృతి వంటి కంటెంట్‌ను చూపించేది. అలా సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న అలీజా సహర్ ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. ఆమె ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో లీక్ అయి వైరల్‌గా మారింది.

(ఇదీ చదవండి: కల్పికతో ఎఫైర్‌ లేదు.. ఆమె చేసిన రచ్చకు కారణం ఇదే: అభినవ్ గోమటం)

ఏం జరిగింది..?
అలీజా సహర్ ఒక వ్యక్తితో వీడియో కాల్‌లో మాట్లాడింది. ఆ సమయంలో జరిగిన కొన్ని కార్యకలాపాలు వీడియో కాల్‌లో రికార్డ్ చేయబడ్డాయి. దానిని ఆ వ్యక్తి ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడని ఆమె తెలుపుతుంది. నివేదికల ప్రకారం ఆ వీడియో కాల్‌లో అలీజా సహర్ తన దుస్తులు తొలగించి శరీరాన్ని ప్రదర్శిస్తున్న దృశ్యాలతో పాటు కొంత అసభ్యకరమైన మాటలు ఉన్నాయని చెబుతున్నారు. దీంతో పాకిస్థానీ సోషల్ మీడియా స్టార్ చిక్కుల్లో పడింది. అయితే, అలీజా సహర్ ఇప్పటికీ దీని గురించి స్పందించి అందులో ఉండేది తాను కాదని ఎవరో వీడియోను ఎడిట్‌ చేశారంటూ ఆమె పాక్‌ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి వెళ్లింది. కానీ నెటిజన్లు మాత్రం వీడియోలో ఉండేది పక్కాగా ఆమెనే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియా స్టార్ అలీజా సహర్ పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్‌ఐఏ)ని ఆశ్రయించి.. తన ప్రైవేట్ వీడియోను లీక్ చేసిన వ్యక్తిపై ఫిర్యాదు చేసింది. ఈమేరకు ఖతార్‌లో నివసిస్తున్న అతన్ని ఎఫ్‌ఐఏ గుర్తించినట్లు ఆమె తెలిపింది. ఈ విషయాన్ని అలీజా తన వీక్షకులకు చెప్పింది. సైబర్ క్రైమ్ టీమ్ కూడా తనకు సహాయం చేసేందుకు వచ్చిందని ఆమె తెలిపింది. కష్టకాలంలో తనకు మద్దతుగా నిలిచిన ఆన్‌లైన్ కమ్యూనిటీకి తన యూట్యూబ్‌ ద్వారా కృతజ్ఞతలు తెలిపింది.

Advertisement

What’s your opinion

Advertisement